ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గోల్డెన్ వర్డ్స్... ఒక్కసారి స్నేహం చేస్తే...

తెలుగులోనే కాక దాదాపుగా 16 భాషలలో పాటలు పాడి తన గానంతో భారత దేశపు ప్రజలను ఎంతగానో అలరించిన  మన తెలుగు గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా ఇటీవలే ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా వైరస్ కారణంగా ఆసుపత్రిలో చేరి కరోనా వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ అనుకోని విధంగా మృతి చెందిన ఘటన సంగీత ప్రియులని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

 Former Veteran Singer Sp Balasubrahmanyam Golden Words About Friendship, Sp Bala-TeluguStop.com

 కాగా ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇందులో ముఖ్యంగా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణానికి ముందు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ ప్రతి మంగళవారం రాత్రి 09.30 నిమిషాలకు ప్రసారమయ్యే  ఆలీ తో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొని స్నేహ బంధం పై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ  ట్రేండింగ్ అవుతున్నాయి. అయితే ఇందులో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇతరులతో స్నేహం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలిగానీ స్నేహం చేసిన తర్వాత అస్సలు వదిలి పెట్టకూడదని అంతేగాక వీలైతే అతడి చెడు స్వభావాన్ని, చెడు అలవాట్లను మార్చేందుకు ప్రయత్నించాలని అంటూ స్నేహంపై గొప్ప వ్యాఖ్యలు చేశాడు.

 అంతేకాక తనకి స్నేహితులంటే ఎంతో అభిమానమని దాదాపుగా ముందుగా తన స్నేహితుల తర్వాతే తన కుటుంబ సభ్యులని కూడా ఒకానొక సమయంలో వారు చేసినటువంటి సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

ఏదేమైనప్పటికీ దాదాపుగా ఐదు దశాబ్దాలుగా తన గాత్రంతో ప్రేక్షకులను మైమరపించి చేసినటువంటి ప్రముఖ గాయకుడు, నటుడు, మ్యూజిక్ డైరెక్టర్, సినీ ఆర్టిస్ట్, ఒక్కసారిగా కన్నుమూయడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది.

అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం దాదాపుగా 40 వేలకు పైగా పాటలను 16 భాషలలో పాడి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాడు.అందువల్లే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, అవార్డులు వరించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube