బైడెనే అనుకున్నాం... బుష్ కూడానా : ఉక్రెయిన్ ప్లేస్‌లో ఇరా‌క్‌ని పెట్టిన పెద్దాయన, ట్రోలింగ్

వయోభారమో లేక కంగారు పడతారో తెలియదు కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు తానుగా నవ్వుల పాలవుతున్నారు.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయనది ఇదే తంతు.

 Former Us President Bush Slams invasion Of Iraq In Ukraine Speech, Blames It On-TeluguStop.com

మొన్నామధ్య కమలా హారీస్‌ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు బైడెన్.అంతేకాదు మంత్రుల పేర్లు, వారి హోదాలను సైతం ఆయన చెప్పలేక తడబడ్డారు.

తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన.రష్యా – ఉక్రెయిన్ సమస్య గురించి ప్రస్తావించారు.ఈ క్రమంలో ఉక్రెయిన్ అనాల్సిందిపోయి ఇరాన్ అంటూ వ్యాఖ్యానించి పరువు పొగొట్టుకున్నారు.ఇలా ఒకటి కాదు రెండు కాదు.బైడెన్ అభాసుపాలైన సందర్భాలు కోకొల్లలు.

అచ్చం ఇదే సమస్యను ఎదుర్కొన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్.

డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండించారు.

ఇదే సమయంలో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా విమర్శించారు.ఈ క్రమంలో పొరపాటున ఉక్రెయిన్ అనాల్సిందిపోయి ఇరాక్ అని పలికారు బుష్.

దీంతో అక్కడున్న నేతలు, అధికారులు, ప్రజలు, మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.ఆ వెంటనే జరిగిన తప్పుని గుర్తించిన జార్జ్ బుష్.

ఇరాక్‌కు బదులుగా ఉక్రెయిన్ అని సరి చేసుకున్నారు.అంతేకాదు తన వయసును అక్కడున్న వారికి చెప్పే ప్రయత్నం చేసిన ఆయన.వృద్ధాప్యం కారణంగానే ఇలా జరిగిందనేలా వ్యవహరించారు.

Telugu Blames Age, Bushslams, Iraq, Joe Biden, Kamala Harris, Russianvladimir, U

ఎంత తప్పును సరిదిద్దుకున్నా నెటిజన్లు ఊరుకుంటారా చెప్పండి.బుష్‌ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలోకి ఎక్కడం దీనిపై కామెంట్స్ పోటెత్తడం చకచకా జరిగిపోయింది.ఇకపోతే.

అధ్యక్షుడిగా బుష్ వున్న సమయంలో ఇరాక్‌పై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు దాడులు చేసి సద్దాం హుస్సేన్‌ని గద్దె దింపి, ఆయన్ను ఉరికంభం ఎక్కించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube