అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కేంద్ర మాజీ మంత్రి.. ?

మరో రాజకీయ కెరటం నింగికి ఎగిసింది.రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా 1988-94 మధ్య కాలంలో జనతాదళ్ పార్టీ నుండి ఎన్నికైన కమల్ మోరార్కా, చంద్రశేఖర్‌ ప్రభుత్వంలో 1990-91లో కేంద్ర మంత్రిగా పనిచేయడమే కాకుండా, 2012 నుంచి సమాజ్ వాదీ జనతా పార్టీ కి నాయకత్వం కూడా వహించారు.

 Ex Union Minister, Kamal Morarka, Death, Illness Issue-TeluguStop.com

అంతే కాకుండా క్రీడలపై ఉన్న మక్కువతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా, బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు కమల్.మరో వైపు సామాజిక సేవ కార్యకర్తగా ఎన్నో సేవలందించారు.

పారిశ్రామిక వేత్తగా మోరార్కా ఆర్గానిక్ కంపెనీ చైర్మన్‌గా వ్యవహరించారు.

ఇకపోతే మార్వాడీ కుటుంబంలో 1946 జూన్ 18వ తేదీన జన్మించిన కమల్ మొరార్కా ప్రస్తుత వయస్సు 74 సంవత్సరాలు.

కాగా కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త అయినా కమల్ మొరార్కా మరణం పట్ల పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.కమల్ మొరార్కా మృతి తీరని లోటుగా వర్ణిస్తూ, రాజస్థాన్ రాష్ట్ర మాజీ మంత్రి, నవల్‌గఢ్‌ శాసన సభ్యుడు రాజ్‌కుమార్‌ శర్మ సంతాపం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube