అనారోగ్యం తో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి  

Former Union minister Jaswanth singh passes away, Jaswanth singh, Union minister, BJP, Vajpayee, Army Hospital, Delhi, - Telugu Army Hospital, Bjp, Delhi, Jaswanth Singh, Union Minister, Vajpayee

బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి జ‌శ్వంత్ సింగ్ మృతి చెందినట్లు తెలుస్తుంది.మాజీ ప్రధాని వాజ్ పేయి హయాంలో రక్షణ,ఆర్ధిక,విదేశాంగ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వర్తించిన ఆయన గత కొంత కాలంగా అనారోగ్యం బారిన పడడం తో ఈ ఏడాది జూన్ 25 న ఢిల్లీ లోని ఆర్మీ దవాఖానా లో చేరినట్లు తెలుస్తుంది.

TeluguStop.com - Former Union Minister Jaswanth Singh Passes Away

మ‌ల్టీఆర్గాన్ డిసిన్ఫెక్ష‌న్ సిండ్రోమ్ సెప్సిస్ చికిత్స పొందుతున్నారు.అయితే ఈ రోజు ఉదయం ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఉద‌యం 6.55కు తుదిశ్వాస విడిచార‌ని వైద్యులు ప్ర‌క‌టించారు.బీజేపీ సీనియర్ నేతగా,పలు మార్లు కేంద్ర మంత్రిగా జ‌శ్వంత్ సింగ్ పని చేశారు.1980 నుంచి 2014 వ‌ర‌కు పార్ల‌మెంట్ స‌భ్యునిగా ఉన్న ఆయన ఐదుసార్లు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా, నాలుగుసార్లు లోక్‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.1998-99 వ‌ర‌కు ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేశారు.2004-2009 వ‌ర‌కు రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్యవ‌హ‌రించారు.1938లో రాజస్థాన్‌లో జన్మించిన జశ్వంత్‌ సింగ్.భారత సైన్యంలో వివిధ హోదాల్లో సేవలు అందించారు.రిటైర్మెంట్ తరువాత బీజేపీలో చేరిన ఆయన 1980 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు.ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి ఆయన అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు.

TeluguStop.com - అనారోగ్యం తో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తదితరులు జశ్వంత్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

#Union Minister #Jaswanth Singh #Vajpayee #Delhi #Army Hospital

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Former Union Minister Jaswanth Singh Passes Away Related Telugu News,Photos/Pics,Images..