అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి మృతి !

అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ ప్రాణాలు విడిచారు.కరోనాతో కోలుకున్న తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నులు మూశారు.రఘువంశ్ ప్రసాద్ సింగ్ మరణవార్త విని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

 Central, Ex Minister, Raghu Vamsh Prasad Singh, Dead,-TeluguStop.com

32 సంవత్సరాలు ఆర్జేడీ పార్టీలో కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ హఠాత్మరణం చెందారు.గత కొంత కాలం కిందట కరోనా రావడంతో పరీక్షలు చేయించుకున్నారు.చికిత్స అనంతరం ఆయనకు కరోనా నెగిటివ్ రావడంతో ఇంట్లో హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.అనారోగ్య సమస్య తలెత్తడంతో కుటుంబీకులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.పరీక్షలు నిర్వహించిన వైద్యులు శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో రఘువంశ్ ప్రసాద్ సింగ్ ను వెంటిలేటర్ పై చికిత్స అందించారు.

అయినా ఫలితం లేకుండా పోయింది.దీంతో ఆయన పరిస్థితి రోజు రోజుకి విషమించడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

అయితే ఆస్పత్రిలో ఉన్నప్పుడే ప్రసాద్ సింగ్ ఆర్జేడీ పార్టీకి రాజీనామా చేసినట్లు పార్టీ కార్యాలయ అధికారులు వెల్లడించారు.ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ప్రసాద్ సింగ్ రాజీనామా లేఖను పంపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube