మన్మోహన్‌ని తప్పుదోవ పట్టించాడు

Raja Misled EX PM Manmohan Singh

పదేళ్లపాటు దేశానికి ప్రధానిగా పనిచేసిన తలపండిన ఆర్థికవేత్త డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ వ్యక్తిగతంగా అవినీతిపరుడు కాకపోయినా అసమర్థ ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారు.ప్రపంచ బ్యాంకులోనూ, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గానూ పనిచేసిన ఈ పెద్దమనిషి మినిస్టర్లను అదుపులో పెట్టుకో లేక కుంభకోణాల్లో కూరుకుపోయారు.

 Raja Misled Ex Pm Manmohan Singh-TeluguStop.com

దేశంలో సంచలనం కలిగించిన బొగ్గు కుంభకోణంలో, అంతకుముందు టూజీ కుంభకోణంలోనూ మన్మోహన్‌ మీద ‘మరకలు’ పడ్డాయి.బొగ్గు శాఖను నిర్వహించింది కూడా సింగుగారే కాబట్టి ఆ పాపం మొత్తం ఆయనదేనని చెప్పుకోవాలి.

ఈ రెండు కుంభకోణాల మీద విచారణ జరుగుతోంది.టూజీ కుంభకోణంలో ప్రత్యేక న్యాయస్థానంలో చివరిదశ వాదనలు జరుగుతున్నాయి.

అప్పట్లో టెలికాం శాఖను నిర్వహించిన తమిళనాడుకు చెందిన ఎ రాజా టూజీ స్పెక్ర్టమ్‌ కేటాయింపుల విషయంలో మన్మోహన్‌ను తప్పుదారి పట్టించారని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో చెప్పింది.అర్హత లేని కంపెనీలకు టూజీ కేటాయింపులు జరిగాయని సీబీఐ పేర్కొంది.

ఈ కేసులో రాజాతో పాటు డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి కూతురు కనిమొళి, కొందరు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube