టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్..!!

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నీ విశాఖ జిల్లా చింతపల్లి పోలీసులు అరెస్టు చేశారు.చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ని విశాఖ ఎస్పీ ధ్రువీకరించారు.

 Former Tdp Mla Prabhakar Arrested Tdp, Chinthamaneni Prabhakar, Denduluru, Visha-TeluguStop.com

ఓ వివాహానికి వెళ్తూ ఉండగా చింతమనేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులతో నిరసన కార్యక్రమంలో వాగ్వాదం కి చింతమనేని పాల్పడటంతో ఆయనపై కేసు నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో కూడా చింతమనేని ప్రభాకర్ పై పలు కేసులు నమోదు అయ్యాయి.ఈసారి దెందులూరులో పెట్రో నిరసనల సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో ఆయనపై కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి.

Telugu Ap, Denduluru, Vishaka-Telugu Political News

ఇదిలా ఉంటే చింతమనేని ప్రభాకర్ ని పోలీసులు విశాఖ జిల్లా నుండి దెందులూరు పోలీస్ స్టేషన్ కి తరలించే ఏర్పాట్లు చేశారు.నేడు కోర్టు కి సెలవు కావడంతో ఏలూరులో మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళి న్యాయమూర్తి ఎదుట చింతమనేని హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదేరీతిలో గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాలలో చింతమనేని మరియు ఆయన అనుచరులు అనుమానాస్పదంగా తిరగటంతో విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఏదిఏమైనా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మళ్ళీ కేసు నమోదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు ఖండిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం పై మండి పడుతున్నారు.జగన్ ప్రభుత్వం కావాలని చింతమనేని ప్రభాకర్ ని టార్గెట్ చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube