రాహుల్ గాంధీ పై వైరల్ కామెంట్లు చేసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి..!!

దేశంలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా పంజాబ్ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

 Former Punjab Chief Minister Makes Viral Comments On Rahul Gandhi ,  Amarinder S-TeluguStop.com

ఈ క్రమంలో పంజాబ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ముమ్మరంగా పాల్గొన్నారు.కాగా ఇటీవల రాహుల్ గాంధీ పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోడీ ఆధ్వర్యంలో అమరేందర్ సింగ్ పనిచేశారని రాహుల్ మాత్రమే కాక ప్రియాంక గాంధీ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.దీంతో రాహుల్, ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమరేందర్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు.

పిల్లలు చేసిన ఆరోపణలను నేను పట్టించుకోను అని అన్నారు.నాకు గొప్ప మనవలు ఉన్నారు.వారు నాకు ఏమవుతారు.?, పిల్లల తో సమానం వాళ్ళ తండ్రితో నేను కలిసి పనిచేశాను.50 ఏళ్లు వచ్చినంత మాత్రాన.ఆ వయసు.

రాహుల్ ను కానీ, ప్రియాంకను కానీ ఐన్ స్టీన్ (ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త)ను చేయలేదు.వారు సాధారణ రాజకీయవేత్తలు.

కాలంతోపాటే వృద్ధి చెందాలి.నేను ఎప్పుడు చెప్పేది ఇదే రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలి.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేను నడుచుకొన్నట్లు… చేసిన ఆరోపణలు అసత్యం.అయితే ఇదే సమయంలో పంజాబ్ డిమాండ్లను నెరవేర్చినందుకు వారికి నేను ఎంతో ధన్యుడను.

అంటూ పరోక్షంగా మోడీ సర్కార్ ని అభినందించారు.అంతేకాకుండా జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు దాటితే అది గొప్ప విషయం అవుతుంది అని సెటైర్లు వేశారు అమరేందర్ సింగ్.

Former Punjab Chief Minister Makes Viral Comments On Rahul Gandhi , Amarinder Sing , Rahul Gandhi , Punjab Chief Minister , Viral Comments , State Of Punjab , Assembly , Modi Elections , Priyanka Gandhi - Telugu Amarinder, Assembly, Modi, Priyanka Gandhi, Punjab, Rahul Gandhi

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube