ఇక పివి పాఠం  

Telangana Schools To Teach Pv Life History-

పివి…అనే పొడి అక్షరాలు వెనక ఉన్న మహోన్నత వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు.దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏం తోచక దిక్కులు చూస్తున్నప్పుడు ‘ఆర్థిక సంస్కరణలు’ అనే అస్ర్తంతో పరిస్థితిని గాడిలో పెట్టిన ప్రధాని ఆయన.

‘మౌన ముని’ అని కొందరు వ్యంగ్యంగా అన్నా ‘మాటల కంటే చేతలు మిన్న’ అని నిరూపించారు.ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు తరువాతి కాలంలో వెర్రి తలలు వేసినా ఆ సమయంలో మాత్రం ఆయన చేసింది సరైన పనేనని అంటారు చాలామంది ఆర్థికవేత్తలు.

Telangana Schools To Teach Pv Life History- తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరాలు ..కధనాలు --

తెలంగాణ వ్యాప్తంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు తొంభై నాలుగో జయంతిని ఘనంగా జరిపారు.ప్రభుత్వం దీన్ని అధికారికంగా నిర్వహించింది.తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో పివి నరసింహారావుపై పాఠం పెడుతున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది.పివి జీవిత చరిత్రను పాఠశాల విద్యార్థులకు పాఠంగా పెడుతున్నట్లు కరీంనగర్‌ ఎంపీ బి వినోద్‌ కుమార్‌ చెప్పారు.

ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెసు ప్రభుత్వం పివిని నిర్లక్ష్యం చేసిందన్నారు.కరీంనగర్‌లో ఆయన విగ్రహం పెట్టబోతున్నట్లు చెప్పారు.పాఠం పెట్టడం మంచి పనే.అయితే దార్శనికుడైన పివి కేవలం తెలంగాణ బిడ్డ కాదు.

ఆయన తెలుగు ప్రజలందరికీ గౌరవనీయమైన నాయకుడు.ఆయన చరిత్రను ఆంధ్రలోని విద్యార్థులు కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

ఈ విషయం చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించాలి.

.

తాజా వార్తలు