మాజీ అధ్యక్షులకు రాజభోగమే....వామ్మో.. ఇన్ని సదుపాయాలా..!!

ఎట్టకేలకు అమెరికా అద్యక్ష ఎన్నికలకు శుభం కార్డ్ పడింది.గెలుపు ఓటములు సహజమే అయినా ఓటమిని స్పోర్టివ్ గా తీసుకునే సామర్ధ్యం అందరికి ఉండదు అందుకే కాబోలు ట్రంప్ నేను ఓడిపోలేదని ఇప్పటికి తన వాదన వినిపిస్తున్నాడు.

 Former President Facilities In Usa, America President, Office Allowances, Pensio-TeluguStop.com

ఏది ఏమైనా అతి త్వరలో ట్రంప్ శ్వేత సౌధం విడిచి బయటకు రావాల్సిందే.ఓటమికి ఎన్నికారణాలు ఉన్నా త్వరలో ట్రంప్ మాజీ అధ్యక్షుడు అవ్వనున్నాడు అనేది సత్యం.

ఇక తాపీగా తన ఓటమికి కారణాలు వెతుక్కుని లెక్కలు ఎలాగో వేసుకుంటారు ట్రంప్ అయితే.


ట్రంప్ శ్వేత సౌధంలో అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచీ వచ్చే సౌకర్యాలు, వసతులకు కొదవే లేదు.

రాజభోగాలు అనుభవిస్తారు అధ్యక్ష హోదాలో ఉన్న వాళ్ళు.మరి ఈ భోగాలు అనుభవించి మాజీలు అయిన అధ్యక్ష్యుల పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రభుత్వం వారికి ఎలాంటి సౌకర్యాలు ఇస్తుంది.

వారి జీవన విధానంలో ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుంది అనేది చాలా మందికి తెలియదు.ఇప్పుడు ఆ విషయాలు మనం తెలుసుకుందాం.

ఒక్క సారి అధ్యక్షుడు అయ్యి వారు మాజీలుగా మారిన తరువాత ప్రభుత్వం మాజీ అద్యక్షులకు రాజభోగాలు కల్పిస్తుంది.ఆ సౌకర్యాల లిస్టు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది.1958 లో అమలు లోకి వచ్చిన ప్రెసిడెంట్ యాక్ట్ ప్రకారం మాజీ అధ్యక్షులకు జీతాలతో పాటు,ఆరోగ్య భీమా, రహస్య భద్రత వంటి సకల సౌకర్యాలు కల్పిస్తుంది.ప్రతీ ఏడాది మాజీ అధ్యక్షుడి ఖాతాలో రూ.1.6 కోట్ల ఫించన్ జమ అవుతుంది.ఏంటి షాక్ తిన్నారా అదొక్కటే కాదు

మాజీ అధ్యక్షుడి భాగస్వామికి కూడా ఏడాదికి 20వేల డాలర్ల ఫించన్ కూడా అందిస్తారు.వైట్ హౌస్ విడిచి పెట్టిన తరువాత సొంతగా వారు ఇల్లు కట్టుకోవడానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుంది.

అంతేకాదు వారి వారి వ్యక్తిగత సిబ్బంది జీతాలు కూడా చెల్లిస్తుంది.కుటుంభం మొత్తానికి ఆరోగ్య భీమాతో పాటు రహస్య భద్రతను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube