టాలీవుడ్ హీరోలు యంగ్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో హీరో అడివి శేష్(Adivi Sesh) ఒకరు.హిట్ ఫ్లాప్ లకు సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన తాజాగా హిట్ 2 (Hit 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ప్రస్తుతం అడివి గూడచారి 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇకపోతే గత ఏడాది నటించిన మేజర్ సినిమా(Major Movie) ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.26/11 ముంబైలో జరిగిన దాడుల ఘటనలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Sandeep Unnikrishnan) జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ జీవించారని చెప్పాలి.ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసల కురిపించారు.అలాగే ఇండియన్ ఆర్మీ సైతం ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించింది.
అయితే తాజాగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ramnath Covind) నుంచి హీరో అడివి శేషుకు పిలుపు వచ్చింది.

ఇలా మాజీ రాష్ట్రపతిని కలిసిన శేష్ పై రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు.మేజర్ సినిమా గురించి మాట్లాడుతూ.సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే హీరోని ఆశీర్వదించారు.ఇది అతిపెద్ద విజయంగానూ, మేకర్స్‌కి గర్వకారణంగానూ ఉంటుందని ఈయన ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఇక ఈ సినిమాకు శశికిరణ్ తిక్క( Sashi Kiran Thikka) దర్శకత్వం వహించగా,సూపర్ స్టార్ మహేశ్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, A+S మూవీస్ సంయుక్తంగా నిర్మించారు.శేష్ ప్రస్తుతం ‘గూఢచారి2’తో పాటు మరిన్ని చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.