19 ఏళ్ల బ్యాట్మింటన్ కెరీర్ కు వీడ్కోలు పలికిన మాజీ నెంబర్ వన్  

Former Number One Say Good Bye To Badminton Career-former Numbe,telugu Viral News Updates,viral In Social Medial,లీ చాంగ్ వూ

బ్యాట్మింటన్ స్టార్ ప్లేయర్,మాజీ నెంబర్ వన్ లీ చాంగ్ వూ భావోద్వేగం తో తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. గత కొన్నేళ్లుగా బ్యాట్మింటన్ లో నెంబర్ వన్ గా కొనసాగిన ఈ మలేషియా ఆటగాడు ఇక పై తన ఆటను కొనసాగించలేనని తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు లీ తెలిపారు. ఎంతో భావోద్వేగానికి గురైన లీ తన 19 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్‌కు ముగింపు ప‌లుకుతున్న‌ట్లు క‌న్నీటీ ధారల మ‌ధ్య త‌న రిటైర్మెంట్‌ను వెల్ల‌డించాడు. 36 ఏళ్ల మేటి బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ లీ చాంగ్. గత కొంత కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు సమాచారం. అయితే ఇటీవల వైద్యులను కలిసిన లీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముక్కుకు సంబంధించిన క్యాన్స‌ర్‌తో లీ బాధ‌ప‌డుతున్న‌ట్లు గ‌త ఏడాది జూలైలో తేలింది..

19 ఏళ్ల బ్యాట్మింటన్ కెరీర్ కు వీడ్కోలు పలికిన మాజీ నెంబర్ వన్ -Former Number One Say Good Bye To Badminton Career

అయితే ఈ కారణంగా ఆయన తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ సంద‌ర్భంగా మ‌లేషియా ప్ర‌జ‌ల‌కు లీ థ్యాంక్స్ తెలిపాడు. వ‌రుస‌గా మూడు ఒలింపిక్స్‌లో లీ చాంగ్ సిల్వ‌ర్ మెడ‌ల్స్ సాధించిన లీ, బీజింగ్‌, లండ‌న్‌, రియోలో సింగిల్స్‌లో ర‌జ‌త ప‌త‌కాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత మూడు ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్స్‌లోనూ ఫైన‌ల్స్‌కు చేరుకున్న లీ లండ‌న్‌, గాంగ్‌జూ, జ‌కర్తాలో జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఈవెంట్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు.