9/11 పరిహార నిధి కిందకు.. డబ్ల్యూటీవో బిల్డింగ్‌ దగ్గర్లోని విద్యార్ధులు, టీచర్లు

9/11 దాడుల సమయంలో న్యూయార్క్‌‌లో చదువుకుంటున్న మాజీ విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి నష్టపరిహారం మరియు వైద్య సదుపాయానికి అర్హులని అధికారులు ప్రకటించారు.ఈ మేరకు న్యూయార్క్ నగర విద్యాశాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

 Former New York Students And Teachers Near World Trade Center-TeluguStop.com
Telugu Telugu Nri Ups, Trade-

2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలోని పబ్లిక్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు ఆ తేదీ నాటికి విద్యార్ధులుగా నమోదు చేయబడిన వారు ఈ పథకానికి అర్హులని అధికారులు తెలిపారు.దీనిలో భాగంగా తాము 19 వేలమంది విద్యార్ధులను, 3000 మంది టీచర్లు, సిబ్బందిని గుర్తించినట్లుగా వెల్లడించారు.9/11 బాధిత పరిహార నిధి, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ ఆరోగ్య పథకానికి వీరంతా దరఖాస్తు చేసుకునేందుకు గాను ఫెడరల్ విద్యాశాఖ, యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ అధికారులు అవగాహనా కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ క్రమంలో వచ్చే నెల 28న న్యూయార్క్‌లో ఓ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు.

అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన 19 మంది తీవ్రవాదులు 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలో నాలుగు విమానాలను హైజాక్ చేశారు.వాటిలో రెండింటిని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పైన, ఒకటి పెంటగాన్‌పైన మరో దానిని పెన్విల్వేనియాలో కూల్చివేశారు.

ఈ ఘటనల్లో మొత్తం 3 వేల మంది చనిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube