లైంగిక వేధింపులు: న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో‌పై కేసు నమోదు..

మహిళా ఉద్యోగిని బలవంతంగా తాకినందుకు గాను న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై లైంగిక వేధింపుల కింద అభియోగం మోపినట్లు న్యూయార్క్ రాష్ట్ర న్యాయస్థానాల ప్రతినిధి లూసియాన్ చాల్ఫెన్ తెలిపారు.లైంగిక వేధింపుల ఆరోపణలపై గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత క్యూమోపై నమోదైన తొలి అభియోగం ఇదే.2020 డిసెంబర్‌లో క్యూమో తన బ్లౌజ్‌పై చేయి వేసి ఆమె ఎడమ వైపు ఛాతిని పట్టుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.దీనిని న్యూయార్క్ రాష్ట్రం తరపున అల్బానీ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ద్వారా దాఖలు చేశారు.

 Former New York Governor Andrew Cuomo Charged With Sex Crime, Former New York Go-TeluguStop.com

అల్బానీ సిటీ కోర్టు ప్రకటన ప్రకారం.క్యూమో (63) నవంబర్ 17 మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఆయనకు సమన్లు జారీ చేశారు.మాజీ సిబ్బందితో సహా 11 మంది మహిళలను క్యూమో లైంగికంగా వేధించినట్లు న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియో జేమ్స్ నిర్థారిస్తూ నివేదికను సమర్పించిన తర్వాత క్యూమో ఈ ఏడాది ఆగస్టులో తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఆండ్రూ క్యూమో అనేక మంది మహిళలను లైంగికగా వేధించారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా తన కార్యాలయానికి రిఫరల్ వచ్చిన క్షణం నుంచి .తాము భయపడకుండా, పక్షపాతం లేకుండా ముందుకు సాగామని జేమ్స్ తెలిపారు.బలవంతంగా తాకినందుకు క్యూమోపై ఈ రోజు నమోదు చేసిన క్రిమినల్ ఆరోపణలు తమ నివేదికలోని ఫలితాలను మరింత రుజువు చేశాయని జేమ్స్ అన్నారు.ఒక మహిళ ఇష్టం లేకుండా బలవంతంగా తాకడం అనేది క్లాస్ ఏ కిందకు వచ్చే నేరం.

దీనికి గరిష్టంగా ఏడాది జైలు శిక్ష విధించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Telugu Andrew Cuomo, Yorkgovernor, Joe Biden, York, Sexual-Telugu NRI

న్యూయార్క్ గవర్నర్‌గా ఆండ్రూ క్యూమో తన పదవికి రాజీనామా చేసిన తర్వాత కాథీ హోచుల్ కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు.దీంతో 233 ఏళ్ల న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలో మొదటి మహిళా గవర్నర్‌గా కాతీ చరిత్రకెక్కారు.2011-13 మధ్య న్యూయార్క్ 26వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి కాథీ కాంగ్రెస్ చట్టసభ్యురాలిగా కొనసాగారు.2015, జనవరి 1న ఆమె న్యూయార్క్ రాష్ట్ర 77వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.కాథీని 2014, నవంబర్ 4న క్యూమో లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించడం జరిగింది.

లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో ఆమె రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్ధిక అభివృద్ది మండళ్లకు అధ్యక్షత వహించారు.అంతేకాకుండా రాష్ట్రంలో హెరాయిన్, ఓపియాయిడ్ దుర్వినియోగాన్ని ఎదుర్కొనే టాస్క్‌ఫోర్స్‌కి కో ఛైర్‌గా వ్యవహరించారు.దీనితో పాటు కాలేజీ క్యాంపస్‌లలో లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి 2015లో క్యూమో.“Enough is Enough” అనే ప్రచారానికి కాథీ నాయకత్వం వహించారు.కాథీ గతంలో న్యూయార్క్ నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం వహించిన జాన్ లాఫాల్స్‌కు సహయకురాలిగా పనిచేశారు.తర్వాత సెనేటర్ డేనియల్ పాట్రిక్‌ మొయినిహాన్‌కు కూడా అసిస్టెంట్‌గా వ్యవహరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube