కేసీఆర్, కేటీఆర్ పై మాజీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు.. ??

తెలంగాణలో ఒక ఎన్నికలు కాకుంటే మరో ఎన్నికలు వరుసగా జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో గులాభి పార్టీకి కమళం గట్టి పోటీనివ్వాలని ప్రయత్నం చేస్తుంది.

 Former Mp Vivek Comments On Kcr Ktr-TeluguStop.com

ఇందులో భాగంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి బీజేపీ.కేంద్రం ఇచ్చిన నిధుల గురించి గులాభి నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం అయ్యింది.

ఇప్పటికే బండి సంజయ్ గులాభి నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ కూదా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 Former Mp Vivek Comments On Kcr Ktr-కేసీఆర్, కేటీఆర్ పై మాజీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, అమెరికాలో చదువుకున్న అజ్ఞాని కేటీఆర్ అని దుయ్యబట్టారు.అబద్ధాలు చెప్పడంలో తన తండ్రి కేసీఆర్ ను కేటీఆర్ మించిపోయారని ఎద్దేవా చేశారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం సిగ్గుపడే విధంగా అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో హైదరాబాద్ 4వ స్థానం నుంచి 24వ స్థానానికి పడిపోయిందని, దీనికి కేటీఆర్ అసమర్థతే కారణమని వివేక్ వ్యాఖ్యానించారు.

ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో సైతం టీఆర్ఎస్ ఓటమిపాలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

మరి ఎవరైనా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తూ ఉంటారు.తెలంగాణలో గులాభి పార్టీ, కేంద్రంలో కమళం పార్టీ ఈ రెండు ప్రజలను దోచుకోవడం తప్ప పేదలకు చేసిన మేలు ఏందని కొందరు గుసగుసలాడుకుంటున్నారట.

#Comments #Former Mp #Failed #Vivek

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు