టీఆర్ఎస్ ఓటమికి కారకుడు ఎవరు ? హరీష్ కే చెక్ పెట్టేలా ?

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది.ఈ నియోజకవర్గంలో గెలుపు తమదేనని ఆ పార్టీ ఉంటూ వచ్చింది.

 Former Mp Jitender Reddy Is The Reason- Or The Bjps Victory In The Huzurabad Ele-TeluguStop.com

అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ నియోజకవర్గంలోని వేసి మరీ తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ విజయానికి కృషి చేశారు.  ముఖ్యంగా మంత్రి హరీష్ రావు నియోజకవర్గ బాధ్యతలను పూర్తిగా తీసుకుని పెద్ద ఎత్తున బిజెపి కాంగ్రెస్ పార్టీల నేతలను టిఆర్ఎస్ లో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తో పాటు , గ్రామాల వారీగా నాయకులను పిలిపించి వారితో సమావేశాలను నిర్వహించారు.

ఎక్కడా అ విజయానికి డోకా లేకుండా అన్ని వ్యవహారాలను హరీష్ రావు అమలు చేశారు.దీనికితోడు టిఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకం కూడా అమలు చేసింది.

అయినా ఓటర్లు బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపారు.అసలు ఇంతగా టిఆర్ఎస్ ఎన్నికల కోసం కష్టపడినా, గత కొద్ది నెలలుగా పూర్తిస్థాయిలో ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెంచినా,  విజయం దక్కకపోవడం పై ఇప్పుడు సమీక్ష నిర్వహించుకుంటున్నారు.
       అయితే ఈ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కంటే ఎక్కువగా బిజెపి తరపున  హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి,మాజీ ఎంపీ జితేంద్ర రెడ్డి  సైలెంట్ గా తన వ్యూహాలు అమలు చేశారు.హరీష్ రావు చేరికలపైన ఎక్కువగా దృష్టి పెడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే పనులు ఉండగా, జితేందర్ రెడ్డి మాత్రం సైలెంట్ గా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారు.
   

Telugu Congress, Etela Rajendar, Hujurabad, Jithendar Reddy-Telugu Political New

  జనాల్లో బలమైన నేతలు ఎవరు అనేది గుర్తించి వారి ద్వారా బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కు మేలు జరిగే విధంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారు.అసలు జితేందర్ రెడ్డి రాజకీయాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు.ఈటెల రాజేందర్ విజయంలో జితేందర్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉన్నా, ఆయన పెద్దగా ఫోకస్ అవ్వకుండా తన సత్తా చాటుకున్నారు.ఇప్పుడు జితేందర్ రెడ్డి వ్యవహారం పై బీజేపీ లో చర్చ జరుగుతోంది.

కేసీఆర్ ను డీ కొట్టిన నేతగా ఆయనకు ఆ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube