ప్రజలు ఆశించినట్టు జనసేన పని చేయడం లేదని కీలక వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నేత.. ?

జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది.సొంత పార్టీ నేతనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ పార్టీకి రాజీనామ చేసారు.

 Former Mlc Madasu Gangadharam Resigns Janasena Party-TeluguStop.com

ఆ వివరాలు చూస్తే.జనసేన పార్టీలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా పని చేసి, ప్రస్తుతం ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, రాజీనామా చేశారు.

తాను పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఓటర్లకు పవన్ అండగా నిలవడం లేదని, ప్రజలు ఆశించినట్టుగా జనసేన పని చేయడం లేదని ఆరోపణలు గుప్పించారు.కాగా సినిమాలు, రాజకీయాలు వేవేరు రని, వాటి మధ్య తేడా తెలియని వారితో తాను పని చేయలేనని వ్యాఖ్యానించారు.

 Former Mlc Madasu Gangadharam Resigns Janasena Party-ప్రజలు ఆశించినట్టు జనసేన పని చేయడం లేదని కీలక వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నేత.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా జనసేన అధినేత పవన్ తెలుగుదేశంకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతున్న కూడా ఈ వార్తలను ఏ మాత్రం ఆయన ఖండించడం లేదని అలా మౌనంగా ఉండటం నిజాన్ని అంగీకరించినట్టుగా భావిస్తున్నారనే ప్రచారం జరుగుతుందని గంగాధరం అన్నారు.

#Resigns #Janasena Party #Madasu Resigns #ExMlc #Former Mlc

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు