బీజేపీలో చేరి కేసీయార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ.. ??

రాజకీయాల్లో గోడ దూకడాలు కామనే.ఏ పార్టీకి ప్రజల్లో పలుకుబడి పెరుగుతుందో చూసుకుని నాయకులు ముందస్తు జాగ్రత్తగా ఆ పార్టీలోకి వలస వెళ్లుతారు.

 Former Mlc Dilip Kumar Joins Bjp And Made Interesting Comments On Kcr-TeluguStop.com

అసలు ఈ వలసల విధానం అనేది లేకుంటే పార్టీలు నిలబడని దుస్దితి రాజకీయాల్లో నెలకొంది.అందుకే వలసలను ప్రతి పార్టీ ప్రోత్సాహిస్తుంది.

ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఈరోజు బీజేపీలో చేరారు.

 Former Mlc Dilip Kumar Joins Bjp And Made Interesting Comments On Kcr-బీజేపీలో చేరి కేసీయార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా గతంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఈయన బీజేపీ తీర్థం పుచ్చు కోగానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.

ముఖ్యంగా కేసీఆర్ ఓ కుటిల రాజకీయనేత అని విమర్శించారట.అంతే కాకుండా గతంలో మాజీ ప్రధాని పీవీని సమైక్యవాది అని విమర్శించిన కేసీఆర్ నేడు పీవీని కీర్తిస్తూ, ఆయన కుమార్తె వాణికి టికెట్ ఇవ్వడం ద్వారా బ్రాహ్మణ ఓట్లు రాబట్టాలనే కుటిల ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

అసలు పీవీ అంటేనే అభిమానం చూపని కేసీయార్ ఆయన కూతురిని ఈ ఎన్నికల్లో బలిపశువును చేస్తున్నారని, వీలైతే వాణీదేవి కూడా తన నామినేషన్ వెనక్కి తీసుకుని, ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని దిలీప్ కుమార్ సూచించారు.ఇకపోతే కేసీయార్ సంపాదించిన అక్రమ ఆస్తుల మీద ఏ క్షణాన అయినా ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

#Joins Bjp #Former Mlc #Dilip Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు