చంద్రబాబు ఆధ్యర్యంలో టీడీపీలో జాయిన్ అయినా మాజీ ఎమ్మెల్యే..!!

Former MLA Joins TDP Under Chandrababu's Leadership TDP, Chandrababu, Srikalahasthi, Muniramaiah, Biyyapu Madhusudhan Reddy, Ap Politics, Ysrcp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోకి కీలక నాయకులు రావడానికి రెడీ అవుతున్నారు.పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చాలామంది నాయకులు వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లు.

 Former Mla Joins Tdp Under Chandrababu's Leadership Tdp, Chandrababu, Srikalahas-TeluguStop.com

ఏపీ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాజీ శాసనసభ్యుడు ముని రామయ్య డీపీలో జాయిన్ కావడం జరిగింది.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసంలో తన కుమారుడు ప్రవీణ్ తో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు.ఇక ఇదే సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా చంద్రబాబుతో ముని రామయ్య దాదాపు గంటకు పైగా చర్చలు జరపడం జరిగింది. 1985 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారి ముని రామయ్య ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.అనంతరం 1999 ఎన్నికలలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోవడం జరిగింది.ఆ ఓటమి తర్వాత రాజకీయాలకు దూరమైన ముని రామయ్య ఇటీవల తన కుమారుడు ప్రవీణ్ తో కలిసి టీడీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.2019 ఎన్నికలలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలవడం జరిగింది.తెలుగుదేశం పార్టీకి చెందిన బొజ్జల సుధీర్ రెడ్డి పై 38వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఇటువంటి క్రమంలో ముని రామయ్య టీడీపీలో జాయిన్ కావడం.ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube