Former MLA Aroori Ramesh : నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు.. మాజీ ఎమ్మెల్యే ఆరూరి కామెంట్స్

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్( Former MLA Aroori Ramesh ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( BRS KCR ) తో సమావేశం అయ్యారు.తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని తెలిపారు.

వార్తలు వస్తున్నట్లు తాను అమిత్ షా( Amit Shah ) ను కలవలేదని వెల్లడించారు.అదేవిధంగా తమ పార్టీ నేతలతో కలిసి వచ్చానని తెలిపారు.

అయితే ఈ ఉదయం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నివాసం వద్ద హైడ్రామా జరిగిందన్న విషయం తెలిసిందే.బీఆర్ఎస్ ను వీడి ఆయన బీజేపీలో( BJP ) చేరతారంటూ ప్రచారం జోరుగా సాగింది.

Advertisement

అయితే ఈ వార్తలకు తెర దించుతూ మాజీ ఎమ్మెల్యే ఆరూరి తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు