నన్ను ఎందుకు అలా చూపిస్తున్నారు అంటూ మాజీ మిస్ ఇండియా ఆవేదన..?

బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా అంటే చాలా మందికి తెలియక పోవచ్చు.కానీ ఆశిక్ బనాయా పాటలోనే బ్యూటీ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు.

 Former Miss India Universe Tanushree Dutta Upset Over Her Wikipedia Profile And-TeluguStop.com

ఆ పాట తనుశ్రీ దత్తా కు అంతలా గుర్తింపు తెచ్చిపెట్టింది.ఆ ఒక్క సాగుతోనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, యూత్ ని సైతం ఆకట్టుకుంది.

అంతకముందే 2004లో తను శ్రీ దత్త మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.ఆ తర్వాత జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా ఆమె  పాల్గొంది.

ఇక ఆ పోటీల్లో దాదాపుగా 133 దేశాలనుంచి అందగత్తెలు పాల్గొన్నారు.

ఇక ఆ కాంపిటేషన్ లో టాప్ టెన్ జాబితాలో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే తాజాగా సెలబ్రిటీలతో, పలువురు ప్రేమికుల గురించి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి సమాచారాన్ని పొందుపరిచే వికీపీడియాపై అసహనం వ్యక్తం చేసింది.ఎందుకంటే వికీపీడియా తనుశ్రీ ని కేవలం ఇండియన్ మోడల్ గా మాత్రమే చూపిస్తోందని.

దీనిపై సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు చేసింది తనుశ్రీ.ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.

హలో ఫ్రెండ్స్.కొంతకాలంగా నన్ను ఒక విషయం బాగా బాధిస్తోంది.

అదేనా వికీపీడియా ప్రొఫైల్.అందులో కేవలం నన్ను ఇండియన్ మోడల్ గా మాత్రమే చూపిస్తుంది.

అది చాలా తప్పు.అది నా పరపతిని తగ్గించడమే.నేను దానిని మార్చడానికి ప్రయత్నించాను కానీ మళ్ళీ అలాగే వస్తుంది అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.నేను ఒక మిస్ ఇండియా యూనివర్స్ ని.అలాగే ఒక బాలీవుడ్ నటిని కూడా.కానీ వికీపీడియాలో మాత్రం కేవలం ఇండియన్ మోడల్ గానే ఎందుకు రాశారో అర్థం కావడం లేదు.

సాధారణంగా ఎవరైనా సెలబ్రేటింగ్ వర్క్ లేక అవార్డుల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు.ఆ విషయంలో మాత్రం చూపించేది పరమ చెత్తగా ఉంది.కేవలం ఒకే ఒక జీవితం లో ఇంత సాధించిన తరువాత నా గురించి వికీపీడియాలో తగిన సమాచారం లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube