కరోనాతో మరణించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత.. ?

తెలంగాణలో కరోనా వరుసగా రాజకీయనేతల ప్రాణాలను బలిగొంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎక్కువగా కరోనా భయాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో ప్రచారాలు అంటూ తిరిగిన చాలా మంది పొలిటిషియన్స్‌ను కోవిడ్ వైరస్ పట్టుకోగా, అందులో వయస్సు మళ్లిన నేతలు కొందరు మరణిస్తు ఉండటం విషాదకరం.

 Former Minister Senior Congress Leader Who Died With Corona-TeluguStop.com

ఇకపోతే తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కరోనాతో మరణించడం పార్టీ వర్గాల్లో విషాదాన్ని నింపింది.కరోనా నిర్ధారణ అయిన తర్వాత నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన సోమవారం నాడు మరణించారు.

ఇక ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా, కరీంనగర్ నుండి ఆయన మూడు దఫాలు ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొంతకాలం పాటు ఆర్టీసీ ఛైర్మెన్ గా సత్యనారాయణరావు పనిచేశారు.

 Former Minister Senior Congress Leader Who Died With Corona-కరోనాతో మరణించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే సత్యనారాయణ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.

#Passed Away #Telangana #MSatyanarayana #SeniorCongress #Former Minister

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు