తెలంగాణలో బీజేపీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కరీంనగర్ లో బండి సంజయ్( Bandi Sanjay ) ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ లో( Karimnagar ) జరిగిన అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు.బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ చర్చకు వస్తారన్న ఆయన బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని స్పష్టం చేశారు.
బండి సంజయ్ చేతగాని మనిషి అని విమర్శించారు.బీజేపీ నేతలు దేవుడితో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.బీజేపీ ( BJP ) వాళ్లు వచ్చాకనే బొట్టు పెట్టడం నేర్చుకున్నామా అని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలోనే గుడిలోకి వెళ్లడం మనకు బీజేపీ వాళ్లు నేర్పారా అని ప్రశ్నించారు.
అలాగే ఏమీ చేయని బండి సంజయ్ మనకు ఎంపీగా కావాలా? లేక విద్యావంతుడైన వినోద్ కుమార్( Vinod Kumar ) కావాలా? అనేది ఆలోచించుకోవాలని సూచించారు.