ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసనకు దిగారు.సీఎం జగన్ అవినీతి కారణంగానే విద్యుత్ వినియోగదారులపై భారాలు పడుతున్నాయని ఆరోపించారు.
సీఎం జగన్ కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని దేవినేని విమర్శించారు.నాసిరకం పరికరాల వలనే థర్మల్ ప్లాంట్లలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని చెప్పారు.
సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో జగన్ చేసింది సున్నా అని విమర్శలు చేశారు.చంద్రబాబు ఐదేళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని తెలిపారు.
టీడీపీ హయాంలో కరెంట్ కోతలు లేవని వెల్లడించారు.