సీఎం జగన్ తో ముగిసిన మాజీ మంత్రి బాలినేని భేటీ..!!

Former Minister Balineni Beti Ended With CM Jagan, Minister Balineni Srinivas Reddy, AP CM Jagan,Pattadhar,Ongole

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Minister Balineni Srinivas reddy ) ఈరోజు సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్( CM Jagan ) తో సమావేశమయ్యారు.దాదాపు గంటకు పైగా జరిగిన చర్చలో ఒంగోలు జిల్లాకు సంబంధించి ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

 Former Minister Balineni Beti Ended With Cm Jagan, Minister Balineni Srinivas R-TeluguStop.com

చర్చ జరిగిన అనంతరం ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడిన బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు.జిల్లాలో ఇళ్ల పట్టాల గురించి చర్చ జరిగినట్లు తెలిపారు.

అదేవిధంగా జిల్లాలో ఇద్దరు నేతలతో ఇబ్బంది ఉన్నట్లు సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు.అయితే త్వరలోనే ఈ సమస్యని పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఇదే సమయంలో అదనపు బాధ్యతలు ఏవి కూడా వద్దు అని అధినేతకి తెలియజేసినట్లు పేర్కొన్నారు.
మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయిన తర్వాత చాలావరకు పార్టీ కార్యక్రమాలకు బాలినేని దూరమయ్యారు.

కేవలం నియోజకవర్గంకి మాత్రమే పరిమితం కావడం జరిగింది.ఈ క్రమంలో పార్టీలో కొంతమంది నాయకులపై బహిరంగంగా మీడియా సమావేశం నిర్వహించి పరోక్ష వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది.

తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని… సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు.

ఇలాంటి పరిస్తితులలో నేడు వైయస్ జగన్ తో భేటీ అయి అనంతరం.ప్రముఖ మీడియా ఛానల్ తో.పార్టీలో లోటుబాట్లను అధ్యక్షుడు చూసుకుంటారని మాట ఇచ్చినట్లు బాలినేని చెప్పటం సంచలనంగా మారింది.

Former Minister Balineni Beti Ended With CM Jagan, Minister Balineni Srinivas Reddy, AP CM Jagan,Pattadhar,Ongole - Telugu Ap Cm Jagan, Balinenibeti, Ongole, Pattadhar #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube