భారీ కుంభకోణంలో అచ్చెన్నాయుడు..జైలుకి వెళ్ళడం ఖాయమేనా..??

తెలంగాణా రాజకీయాలని కుదిపేసిన అతిపెద్ద ఈఎస్ఐ కుంభకోణం గురించి అందరికి తెలిసిందే.ఈ ఘటనకి సంభందించి ఇప్పటికే పలువురు ఐఎస్ఐ డైరెక్టర్ తో పాటుగా అనేకమంది ఉన్నత అధికారులు తెలంగాణా జైల్లో శిక్షని అనుభవిస్తున్నారు.

 Former Minister Atchannaidu In Ap Esi Scam-TeluguStop.com

ఇప్పుడు ఇదే తరహా కుంభకోణం ఇప్పుడు ఏపీలో జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ చేసిన దాడులలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయని భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్టుగా సమాచారం అందుతోంది.అంతేకాదు ఈ భారీ కుంభకోణంలో మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు కూడా ఉన్నారనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.
గడించిన ఐదేళ్ళ కాలంలో లేని కంపెనీల నుంచీ మందులు కొనుగోలు ఆర్డర్లు వచ్చినట్టుగా చూపించి కోట్లు కొల్లగొట్టారని 975కోట్లు విజిలెన్స్ రిపోర్ట్ లో మాజీ మంత్రి అచ్చెన్న పేరు, అచ్చెన్న ఇచ్చిన లేఖలో ఓపెన్ టెండర్లు అచ్చెన్న సిఫార్సు ఇచ్చిన టెలీ హెల్త్ సర్వీస్ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించాలని ఉంది.అలాగే అచ్చెన్నాయుడు చొరవతోనే కోట్లాది రూపాయల మందులు కొనుగులు చేసి అందులో సుమారు 100 కోట్లకి పైగా నకిలీ బిల్లులు సృష్టించినట్టుగా తెలుస్తోంది.
ఇదిలాఉంటే అప్పటి ప్రభుత్వం రూ.293 కోట్లకే మందులకి బడ్జట్ కేటాయిస్తే అందులో రూ.698కోట్ల రూపాయలు మందులు కొనుగోలు చేసినట్టుగా చూపించి ప్రభుత్వ ఖజానాకి భారీ నష్టాన్ని తీసుకువచ్చారు.ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో అవినీతి అక్రమాలు విజిలెన్స్ వారు గుర్తించారని తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై స్పందించిన కార్మిక శాఖామంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.ఈఎస్ఐ లో భారీ కుంభకోణం జరిగిందని చెప్పడానికి అచ్చెన్నాయుడు రాసిన లేఖ ప్రదాన సాక్ష్యమని అన్నారు.

సొత్తు మొత్తాని తప్పకుండా కక్కిస్తామని అచ్చెన్నాయుడు జైలుకు వెళ్ళడం ఖాయమని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube