టెక్సాస్‌ డెమొక్రాట్ ప్రైమరీలో శ్రీ ప్రెస్టన్ కులకర్ణీ విజయం

అమెరికాలో భారత సంతతికి చెందిన రాజకీయ వేత్త శ్రీ ప్రెస్టన్ కులకర్ణీ మంగళవారం టెక్సాస్ 22వ కాంగ్రెషనల్ జిల్లా డెమొక్రాటిక్ ప్రైమరీలో విజయం సాధించారు.40 ఏళ్ల కులకర్ణీ సీనియర్ దౌత్యవేత్త.ఇరాక్, రష్యా, ఇజ్రాయెల్, తైవాన్లలో దౌత్యవేత్తగా పనిచేశారు.

 Former Indian Origin Diplomat Sri Preston Kulkarni Wins Democratic Primary In U-TeluguStop.com

Telugu Indianorigin, Kulkarni-Telugu NRI

మంగళవారం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో న్యాయవాది న్యాన్జా డేవిస్ మూర్, పియర్‌లాండ్ సిటీ మాజీ కౌన్సిల్ సభ్యుడు డెరిక్ రీడ్లను ఓడించారు.అంతేకాక గతంలో పదవీ విరమణ చేసిన రిపబ్లికన్ పార్టీకి చెందిన పీట్ ఓల్సన్‌‌ను 2018లో ఓడించేందుకు అతి సమీపానికి వచ్చాడు.

Telugu Indianorigin, Kulkarni-Telugu NRI

కులకర్ణీ తండ్రి ఒక భారతీయ నవలా రచయిత ఆయన 1969లో అమెరికాకు వలస వచ్చారు.మరోవైపు అధ్యక్ష అభ్యర్ధి కోసం డెమొక్రాటిక్ పార్టీ నిర్వహిస్తున్న ప్రైమరీ ఎన్నికల్లో మాజీ వైస్ ప్రెసిడెంట్ జోయ్ బిడెన్ ముందంజలో ఉన్నారు.రాష్ట్రాల వారీగా జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో ఆయన మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు.

ప్రెసిడెంట్ పోటీలో నిలబడాలంటే మొత్తం 3,979 డెమొక్రాట్ డెలిగేట్లలో 1991 చోట్ల గెలుపొందాల్సి ఉంటుంది.ప్రస్తుతం బిడెన్ 395 డెలిగేట్లను, ఆయన పోటీదారు బెర్నీ శాండర్స్ 305 మందిని డెలిగేట్లను గెలిచారు.

మంగళవారం సూపర్ ట్యూస్‌డే పేరిట 14 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో 1357 మంది డెలిగేట్లు డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్ధికి ఓటు వేశారు.వర్జీనియా, నార్త్ కరోలినా, అలబామా, ఓక్లమహోమా, టెన్నెసీ, మిన్నెసోటా, మసాచుసెట్స్, అర్కన్సాస్ రాష్ట్రాల్లో బిడెన్ గెలుపొందారు.

కాలిఫోర్నియా, వెర్మాంట్, యుటా, కొలరాడో రాష్ట్రాల్లో శాండర్స్ ఆధిపత్యం చూపారు.భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్ అమెరికన్ సమోవాలోని ప్రైమరీలో గెలుపొందారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube