హాకీలో చాంపియన్ అయిన తప్పని వరకట్నం వేధింపులు  

Former Hockey Captain Suraj Lata Devi Files Police Case - Telugu Domestic Violence, Files Police Case, Former Hockey Captain Suraj Lata Devi, Indian Hockey

భారతదేశం వివాహ వ్యవస్థలో అతిపెద్ద సమస్య వరకట్నం.ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు లక్షల్లో వరకట్నం క్రింద అబ్బాయికి చెల్లించుకోవాలి.

Former Hockey Captain Suraj Lata Devi Files Police Case - Telugu Domestic Violence Indian

ఇలా చెల్లించిన కూడా ఒక్కోసారి మళ్ళీ అత్తింటి వారు, భర్త నుంచి వరకట్న వేధింపులు జరుగుతూనే ఉంటాయి.మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకురావాలని భార్యలని చిత్రహింసలకి గురిచేస్తూ ఉంటారు.

పెద్ద కుటుంబాలలో కూడా ఇలాంటి వేధింపులు మహిళలకి తప్పవు.చివరికి సెలబ్రిటీలు, ప్రముఖులు అయిన అత్తింటి వరకట్న వేధింపులకి తప్పించుకోలేరు.

ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి జరిగింది.దేశానికి హాకీలో ప్రాతినిధ్యం వహించి మూడు సార్లు ఇండియాకి పతకాలు అందించిన క్రీడాకారిణి ఇప్పుడు వరకట్న వేధింపులు ఎదుర్కొంటుంది.

మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ వైఖొమ్‌ సూరజ్‌ లతాదేవి తనకి భర్త నుంచి ఎదురవుతున్న వేధింపులపై పోలీసులకి ఫిర్యాదు చేసింది.తన భర్త శాంతాసింగ్‌ కట్నం కోసం తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వీరిద్దరికీ 2005లో వివాహమైంది.‘నేను సాధించిన పతకాలు, నా ఫొటోలను పెళ్లిరోజే ఆయన ఎగతాళి చేశారు.

తప్పుడు పద్ధతుల్లో అర్జున అవార్డు తెచ్చుకున్నావంటూ నిందించేవారు.గతేడాది నవంబరులో పంజాబ్‌లోని కపుర్తలాలో ఓ టోర్నీ నిర్వహణలో ఉండగా మద్యం తాగి వచ్చి దాడి చేశాడు.

ప్రవర్తన మారుతుందేమోనని వేచి చూశా.ఓపిక నశించడంతో ఫిర్యాదు చేయక తప్పలేదు అని లతాదేవి తెలియజేసింది.

ఈమె సారథ్యంలో భారత జట్టు 2002 కామన్వెల్త్‌, 2003 ఆఫ్రో ఏషియన్‌ గేమ్స్‌, 2004 ఆసియా కప్‌లో స్వర్ణాలు గెల్చుకుంది.ఇంత గొప్ప క్రీడాకారిణి అయిన కూడా లలితాదేవికి పురుషాధిక్య సమాజంలో వేధింపులు తప్పలేదు.

తాజా వార్తలు