Shiva balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మూడో రోజు కస్టడీ విచారణ

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ( Shiv Balakrishna ) మూడో రోజు ఏసీబీ కస్టడీ విచారణ కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆధారాలను ముందుంచి ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను విచారిస్తున్నారు.

శివబాలకృష్ణ అక్రమాస్తుల వెనుక ఐఏఎస్ అధికారి( IAS officer ) పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఎనిమిదేళ్లుగా హెచ్ఎండీఏ పరిధిలో అనుమతి ఇచ్చిన ఫైల్స్ పై అధికారులు దృష్టి సారించారని సమాచారం.ఫైల్స్ పై సంతకాలకు ఐఏఎస్ అధికారికి మేజర్ వాటా ఉన్నట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో శివబాలకృష్ణ విచారణ తరువాత ఐఏఎస్ అధికారిపై ఏసీబీ విచారణ సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇందుకోసం ఏసీబీ మరియు ఎంఏయూడీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.

అలాగే శివబాలకృష్ణ భార్య, బంధువు భరత్( Bharat ) పేరుపై మూడు లాకర్లను గుర్తించారు.బినామీలకు రెండు నెలల క్రితం హోండా సిటీ కార్లను శివబాలకృష్ణ గిఫ్ట్ గా ఇచ్చినట్లు నిర్ధారించారు.

Advertisement

ఈ క్రమంలో గిఫ్ట్ రూపంలో కార్లను ఎందుకు ఇచ్చారని ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు