ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ మీకు గుర్తుందా..?

తెలుగులో ప్రముఖ స్వర్గీయ దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన  “హాయ్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న పంజాబీ ముద్దుగుమ్మ “నికిత తుక్రుల్” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.ఈ అమ్మడు వచ్చి రావడంతోనే ఫర్వాలేదనిపించినా తన తదుపరి చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.

 Nikitha Thukral, Telugu Former Heroine, Real-life News, Telugu Actress,-TeluguStop.com

అయినప్పటికీ నిఖిత కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలో సినిమాలు చేస్తూ బాగానే రాణించింది.

అయితే ఒకానొక దశలో చేతిలో సినిమా అవకాశాలు లేని సమయంలో ముంబైకి చెందిన  ప్రముఖ వ్యాపార వేత్త ప్రేమలో పడింది.

ఈ ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో 2016 సంవత్సరంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నికిత అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించింది.ప్రస్తుతం నికిత కి ఒక పాప కూడా ఉంది.

తెలుగులో నటించిన ఏవండోయ్ శ్రీవారు, నీ నవ్వే చాలు, కళ్యాణ రాముడు, డాన్, తదితర చిత్రాల ద్వారా  నిఖిత మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఆ మధ్య కాలంలో కన్నడ సినీ పరిశ్రమకు చెందినటువంటి దర్శకుడితో ప్రేమాయణం నడిపినందున కొంతకాలం పాటు హీరోయిన్ నిఖిత కన్నడ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురైందని పలు వార్తలు బలంగా వినిపించాయి.కానీ నికిత శర్మ మాత్రం ఎవరో తనపై కావాలనే ఇలాంటి పుకార్లు పుట్టించారని మీడియా ద్వారా స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube