అమెరికాలో మాజీ డిటెక్టివ్ కి షాక్ ఇచ్చిన...'లేడి'...!!!

అమెరికాలో ఓ వింత ఘటన జరిగింది.సహజంగా మనం రోడ్డు దాటే తప్పుడు ఏమి చేస్తాం అటూ ఇటూ చూసుకుంటూ రోడ్డు దాతుతాం.

 Former Detective In America Lady-TeluguStop.com

అలాగే అమెరికాలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రోడ్డు దాటుతూ ఉండగా

ఊహించని షాక్ ఇస్తూ ఓ లేడి ఆ వ్యక్తిని డీ కొట్టి మరీ పారిపోయింది.షాక్ నుంచీ తేరుకున్న ఆ వ్యక్తి ఏమి జరిగిందో అంటూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

వివరాలోకి వెళ్తే.

అమెరికాకి చెందిన కెన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నార్త్ కరోలినా లో ఉన్న లో కాస్ట్ ప్రాంతంలో ఉన్న మెక్ డోనాల్డ్ కి లంచ్ కి వెళ్ళాడు.లంచ్ తరువాత ఇద్దరో ఇంటికి వెళ్తున్నారు.రోడ్డు దాటడానికి సిగ్నల్ పడిన సమయంలో ఒక్క సారిగా ఓ జింక కెన్ మీద నుంచీ ఎగురుతూ కెన్ ని తన రెండు కాళ్ళ తో ఒక్క తన్ను తన్ని అడవిలోకి పరుగులు పెట్టింది.

అమెరికాలో రోడ్లపై కి జంతువులు రావడం సహజమే కానీ ఇలా ఒక మనిషిని తన్ని మరీ పారిపోవడం ఎప్పుడూ జరగలేదని స్థానికులు అంటున్నారు.

ఈ ఘటనపై కెన్ మాట్లాడుతూ తను డిటెక్టివ్ గా పని చేసి రిటైర్ అయ్యానని, తన జీవితంలో ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పుకొచ్చాడు.

మీరు కూడా ఈ ఘటన తాలుకూ వీడియో చూడండి అంటూ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.తనకి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పిన కెన్.

డిటెక్టివ్ కాబట్టి గట్టిగా తన్నిందేమో అంటూ ఫన్నీ గా కామెంట్ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube