మందేసిన మాజీ క్రికెటర్.. పక్కింటివారిపై దాడి  

Former Cricketer Praveen Kumar Attacks Neighbour - Telugu Bowler Praveen Kumar, Cricketer, Indian Cricket Team, National News, Praveen Kumar

భారత క్రికెట్ జట్టుకు ఆడిన మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు.తమను దుర్భాషలాడుతూ తమపై దాడి చేశాడంటూ ప్రవీణ్ కుమార్‌పై ఫిర్యాదు చేస్తున్నారు.

Former Cricketer Praveen Kumar Attacks Neighbour

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్ ఇంటి పక్కన దీపక్ శర్మ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.

కాగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు దీపక్ తన ఏడేళ్ల కొడుకుతో కలిసి బస్టాప్‌లో నిల్చుని ఉన్నాడు.ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్ తన కారులో వచ్చి అక్కడ ఆగి ఉన్న బస్సు డ్రైవర్‌ను దుర్భాషలాడాడు.

అటుపై అక్కడున్న దీపక్ శర్మను కూడా నానా తిట్లు తిడుతూ చేయి చేసుకున్నాడు.అతడి ఏడేళ్ల కొడుకును కూడా ప్రవీణ్ కుమార్ నెట్టేయడంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

కాగా దీపక్ శర్మ చేతికి ఫ్రాక్చర్ అయినట్లు అతడు తెలిపాడు.

తనపై దాడి చేసిన ప్రవీణ్ కుమార్ మద్యం మత్తులో ఉన్నాడని, అతడిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆశ్రయించాడు.

కానీ వారు కేసు నమోదు చేసుకోకపోగా అతడిని కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నట్లు, తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్లు దీపక్ శర్మ తెలిపాడు.ప్రవీణ్ కుమార్ ఈ ఘటనపై స్పందించకపోవడం గమనార్హం.

#Cricketer #Praveen Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Former Cricketer Praveen Kumar Attacks Neighbour Related Telugu News,Photos/Pics,Images..