ఛీటింగ్ కేసులో మాజీ క్రికెటర్ అరెస్ట్.. ?

ఉన్నతంగా మలచుకోవలసిన జీవితాన్ని కొందరు చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు.విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి అడ్డదారుల్లో సంపాధించడానికి ఆసక్తి చూపుతూ చివరికి బజారుపాలవుతున్నారు.

 Andhra Cricketer, Budumuru Nagraj, Arrested, Cheating Case,rainbow Hospital,vira-TeluguStop.com

నలుగురి చేత ఛీ అనిపించుకుంటున్నారు.ప్రస్తుతం ఇలాంటి పని చేసిన ఓ మాజీ క్రికెటర్ జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.

ఆ వివరాలు తెలుసుకుంటే.

 Andhra Cricketer, Budumuru Nagraj, Arrested, Cheating Case,rainbow Hospital,vira-TeluguStop.com

శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం ఎవ్వారిపేట గ్రామానికి చెందిన నాగరాజు గతంలో ఆంధ్రా రంజీ క్రికెట్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాగరాజు పేరిట ఓ గిన్సిస్ బుక్ రికార్డు కూడా ఉంది.2016లో ఏకధాటిగా 82 గంటల నెట్స్ లో బ్యాటింగ్ చేసిన అరుదైన రికార్డును నాగరాజు సొంతం చేసుకున్నాడు.

ఇలాంటి వ్యక్తి విలాసాలకు అలవాటుపడి దారితప్పాడు.తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరలేపాడు.ఈ క్రమంలో రెయిన్ బో ఆసుసత్రి ఎండీ డాక్టర్ కంచర్ల రమేశ్ ను కలిసిన నిందితుడు తాను కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డిగా పరిచయం చేసుకుని, త్వరలో కేటీఆర్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఈ కార్యక్రమం పై మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు రూ.50 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నాడట.

అనుమానం వచ్చిన రెయిన్ బో ఆసుపత్రి ఎండీ బంజారాహిల్స్ పోలీసులకు ఈ విషయం తెలియచేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube