అన్ స్టాపబుల్ ఫస్ట్ గెస్ట్ గా ఏపీ మాజీ సీఎం.. వైరల్ అవుతున్న ఫోటో?

నందమూరి బాలకృష్ణ కేవలం హీరోగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఆహా వేదికగా ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.

 Former Cm Of Ap As Unstoppable First Guest Photo Going Viral, Former Cm, Unstopp-TeluguStop.com

ఇకపోతే ఈ కార్యక్రమం ఇప్పటికే మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ కార్యక్రమాల ద్వారా ఆహా సబ్స్క్రైబర్లు కూడా పెరగడంతో నిర్వాహకులు సీజన్ 2 కార్యక్రమాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నట్లు సమాచారం.

 Former Cm Of Ap As Unstoppable First Guest Photo Going Viral, Former CM, Unstopp-TeluguStop.com

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.మొదటి సీజన్లో కేవలం సినిమా సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానించి బాలకృష్ణ తన స్టైల్ లో వారిని ప్రశ్నించే వారి నుంచి సమాధానాలు రాబట్టారు.

అయితే ఈసారి రాజకీయ నాయకులను కూడా ఈ కార్యక్రమానికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బాలకృష్ణ బావగారు నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా రాబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక ఫోటో వైరల్ కావడంతో చంద్రబాబు నాయుడు మొదటి అతిథిగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారని తెలుస్తుంది.

ఇలా వీరిద్దరూ ఒకే వేదికపై రాజకీయాల గురించి ఏం మాట్లాడనున్నారు.బాలకృష్ణ తన బావకు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేయబోతున్నారనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Former Cm Of Ap As Unstoppable First Guest Photo Going Viral, Former CM, Unstoppable , Ap, Balakrishna, Chandrababu - Telugu Balakrishna, Chandrababu, Cm, Unstoppable #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube