మరణించిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. !

దేశంలోని పెద్ద వయస్సు ఉన్న రాజకీయ నేతలను మృత్యువు పగబట్టినట్లుగా ఉంది.ఎందుకంటే ఈ మధ్యకాలంలో పలు రాష్ట్రాల్లో వరుసగా రాజకీయ నేతల మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

 Former-chief Minister Of The State Who Died Assam, Former Chief Minister, Congre-TeluguStop.com

ప్రస్తుతం మరో మాజీ ముఖ్యమంత్రి మరణించిన ఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.

అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూమిదర్ బర్మన్ (91) నిన్న అనగా ఆదివారం మరణించారని సమాచారం.కాగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బర్మన్, గువహతిలోని ప్రైవేట్ ఆస్సత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారట.

ఇదిలా ఉండగా అసోం, బొర్ఖెట్రి నియోజకవర్గాల నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బర్మన్ 1996 లో అసోం ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.అంతే కాకుండా 2010 లో అప్పటి సీఎం తరుణ్ గగోయ్‌కు గుండెకు శస్త్ర చికిత్స కావడంతో కొన్ని రోజుల పాటు తాత్కాలిక సీఎంగా కూడా వ్యవహరించారు.

ఇకపోతే భూమిదర్ బర్మన్ అకస్మిక మరణానికి పలువురు అసోం రాజకీయ నేతలు తమ సంతాపాన్ని ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube