బీఅర్ఎస్ లోకి మాజీ ముఖ్యమంత్రి..? కేసీఆరా మజాకా..?

సీఎం కెసిఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయిన దగ్గరి నుంచి.కేంద్రం లో చక్రం తిప్పాలి అని కలలు కన్నారు.

 Former Chief Minister Into Brs  Is Kcr A Joke , Cm Kcr, Odisa Ex Cm Giriraj Gama-TeluguStop.com

అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ను.బీ అర్ ఎస్ గా మార్చారు.ఇక ఏపీ లో పార్టీ పై ఫోకస్ పెట్టారు.తోట చంద్ర శేఖర్ తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును, పార్థసారథి ను పార్టీ లో చేర్చుకొని.

ఏపీ బీ అర్ ఎస్ అధినేత గా తోట చంద్ర శేఖర్ కు నియమించాడు.అంతే కాకుండా క్రిస్మస్ తర్వాత దేశం లోని అన్ని రాష్ట్రాలలో.బీ అర్ ఎస్ రైతు శాఖలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఇప్పటికే గుజరాత్ లో పార్టీ కి సారత్యం వహించేందుకు మంచి నేతను వెతుకు తున్నారు.

ఇప్పటికే అక్కడ మాజీ ముఖ్యమంత్రి వాఘెలా తో మంతనాలు జరుపుతూ ఉన్నారు.కర్ణాటకలో కూడా గట్టి నాయకూని కోసం చూస్తున్నారు.ఇలాంటి టైమ్ లో వెతక బోయిన తీగ కాలికి తగిలి నట్టు.ఒడిశా నుంచి కెసిఆర్ పార్టీ కి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది.

దాంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఫార్ములా ను కెసిఆర్ వాడుతూ ఉన్నారు.

Telugu Cm Kcr, Jp Nadda, Odisa Bjp, Odisa Brs, Odisacm, Pm Modi, Shisir Gamang-P

ఒడిశా లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గా చేసిన గిరిధర్ గమాంగ, అయన కుమారుడు శిషిర్ గమాంగ్ లు బీజేపీ పై అలిగి కూర్చొని ఉండటం గమనించారు.ఇక దొరికిందే సందుగా సీఎం కెసిఆర్ చర్చలు స్టార్ట్ చేశారు.అవి దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.

ఒక వేళ అవి ఒక కొలిక్కి వస్తే.కెసిఆర్ పార్టీ కి మరో రాష్ట్రం లో చోటు దక్కినట్టు అవుతుంది.

గిరిరాజ్ గమాంగ్ కూడా బీ అర్ ఎస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉండటంతో దాదాపు అయన చేరిక అయిపోయినట్టే కనిపిస్తోంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు.కెసిఆర్ ప్రపోజల్ మేరకు.

మాజీ ముఖ్యమంత్రి గిరిరాజ్ గమాంగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే పీ నడ్డాకు తన రాజీనామా ను పంపించి నట్టు తెలుస్తోంది.

Telugu Cm Kcr, Jp Nadda, Odisa Bjp, Odisa Brs, Odisacm, Pm Modi, Shisir Gamang-P

గిరిరాజ్ గమాంగ్ కాంగ్రెస్ పార్టీ కి 2015 లో రాజీనామా చేసి, బీజేపీ కండువా కప్పుకున్నారు.అయితే మొదటి నుంచి తనను పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఉన్నారు.అయినా అయ న మాటల్ని బీజేపీ అధిష్టానం పట్టించు కొక పోవడం తో అయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

గిరిరాజ్ గమాంగ్ బీ అర్ ఎస్ పార్టీ లో అధికారికంగా చేరితే.అది అటు బీజేపీ కి చెక్ పెట్టి నట్టు కావడం తో పాటు పార్టీ విస్తరణ కు తోడ్పడుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తానికి సీఎం కెసిఆర్ అనుకున్నట్టు జాతీయ స్థాయిలో ఉనికిని చాటుకోవ డానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube