లక్ష్మీనారాయణ టీడీపీలో చేరితే... ఎవరికి లాభం ఎవరికి నష్టం..  

  • సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ అడుగులు గురించి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఆయన టీడీపీలో చేరబోతున్నారు అనే వార్త హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన చేరితే ఏ పార్టీకి లాభం ఉంటుంది. ఏ పార్టీకి నష్టం ఉంటుంది అనే లెక్కలు మొదలయ్యాయి. ఆయన టీడీపీలో చేరడం దాదాపు ఖాయం అయిపోయిందని ఆయనకు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం కేటాయించారని వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ ఏజంట్ అని ముందునుంచి చెబుతున్నామని, జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన టీడీపీ తో కలిసి కుట్రలు చేశారని అందుకే దానికి ప్రతిఫలంగా ఆయనకు టికెట్ కేటాయిస్తున్నారని విమర్శలు మొదలుపెట్టేసింది.

  • లక్ష్మి నారాయణ విధి నిర్వహణను చూస్తే ఆయన ఒక గౌరవప్రదమైన పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహించాడు. ఆయన సీబీఐలో ఉన్న కాలంలో ఒక్క జగన్ కేసుల్ని మాత్రమే కాకుండా సత్యం స్కాం, గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ స్కాంలను కూడా విచారించారు. వేల కోట్లతో ముడిపడి ఉన్న ఇలాంటి కేసుల్లో ఎక్కువగా అవినీతి జరుగుతూ ఉంటుంది. కానీ వీవీ లక్ష్మినారాయణ ఈ కేసులను విచారించి ఒక కొలిక్కి తీసుకురాగలిగారు. ఆయన విచారించిన కేసుల్లో జగన్ కేసు ఒకటయితే మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఆయన సీబీఐ నుంచి సొంత రాష్ట్రానికి వెళ్లిపోయిన తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆరాటపడ్డారు.

  • Former CBI JD Lakshmi Narayana To Join TDP-

    Former CBI JD Lakshmi Narayana To Join TDP

  • ముందుగా ఆయన సొంత పార్టీ పెట్టాలని చూశారు. దీని నిమిత్తం ఏపీ మొత్తం పర్యటించారు. అనేకమంది మేధావులను కలుసుకున్నారు. కానీ ఈ రోజుల్లో రాజకీయ పార్టీ పెట్టడం అంత సులభమేమీ కాదని , రాజకీయ పార్టీని నడపాలంటే సామాజికంగా, ఆర్ధికంగా బలంగా ఉండాలని లేకపోతే రాణించలేమని ఆయన తెలుసుకున్నారు. అందుకే ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు వస్తున్నా ఆయన మాత్రం ఖండించడం లేదు స్పందించడంలేదు.

  • Former CBI JD Lakshmi Narayana To Join TDP-
  • సీబీఐ అధికారిగా పనిచేసిన లక్ష్మినారాయణ కు మంచి ఇమేజ్ ఉంది. సీబీఐ అధికారి అంటే ఎలా ఉంటారు అంటే రోల్ మోడల్‌గా ఆయనను చూపిస్తున్నారు. ఆ ఇమేజ్ ఎంత కాలం ఉంటుందో చెప్పలేం కానీ టీడీపీలో చేరితే ఆ ఇమేజ్‌కు ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఆయన టీడీపీలో చేరిపోతున్నారు. కావాలనే జగన్ ను టీడీపీ ఆదేశాలమేరకు లక్ష్మీనారాయణ ఇరికించారంటూ జగన్ అనుకూల మీడియా వార్తా కథనాలు ప్రచారం చేయడం మొదలుపెట్టేసింది.