రమణదీక్షితులు నిజంగా హరిభక్తుడేనా.. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షాకింగ్ కామెంట్స్.. ?

తిరుమల తిరుపతి దేవస్దానానికి ప్రధానార్చకులుగా ఉన్న రమణ దీక్షితులు మూడు సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో, అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే టీటీడీ సంచలన నిర్ణయంతో దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఏవీ రమణ దీక్షితులు తిరిగి విధుల్లోకి చేరిన విషయం తెలిసిందే.

 Former Brahmana Corporation Chairman Vemuri Anand Fires On Jagan And Ramana Dikshitulu-TeluguStop.com

కాగా ఈ నియామకం పై బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య తీవ్ర విమర్శలు చేశారు.ఈమేరకు పవిత్రమైన తిరుమల క్షేత్ర పవిత్రతను జగన్ ప్రభుత్వం దెబ్బతీసిందని, రమణ దీక్షితులను తిరిగి ప్రధానార్చకుడిగా నియమించడం ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చిన రమణ దీక్షితులు నిజంగా హరిభక్తుడేనా? అన్న అనుమానం కలుగుతోందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.సొంత లాభానికి నేతల మాటలకు మడుగులెత్తే వారు దైవ భక్తులు ఎలా అవుతారని ప్రశ్నించారు.

 Former Brahmana Corporation Chairman Vemuri Anand Fires On Jagan And Ramana Dikshitulu-రమణదీక్షితులు నిజంగా హరిభక్తుడేనా.. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షాకింగ్ కామెంట్స్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రమణ దీక్షితులను ప్రధానార్చకుడిగా నియమించడం ద్వారా బ్రాహ్మణులకు న్యాయం జరిగిందని చెప్పడం సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించారు.

#Former Chairman #Chief Priest #Fires Jagan #Hari Devotee #FormerBrahmana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు