బీహార్ మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి విషమం.. ??

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్, దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.గురువారం సాయంత్రం లాలూ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంతో రాంచీలోని ఓ హస్పిటల్‌కు పంపించారు.

 Former Bihar Chief Minister Health In Critical Condition, Bihar, Lalu Prasad, He-TeluguStop.com

కాగా ఇక్కడ కూడా లాలు ఆరోగ్యం చికిత్సకు సహకరించక పోవడం, అందులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువవడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ఢిల్లీలో ఎయిమ్స్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.అయితే ఆయనను ఢిల్లీకి తరలించడానికి జైలు అధికారులు కూడా కింది కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉందట.

అదీగాక వైద్యుల బోర్డు నివేదిక అందిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించనున్నారని సమాచారం.

మరోవైపు, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను కలిసి తన తండ్రికి మెరుగైన చికిత్స అందజేయాలని కోరుతానని పేర్కొంటున్నారు.

ఇకపోతే లాలుకు ఇంతకు ముందే గుండె ఆపరేషన్ అయ్యింది.కిడ్నీ కేవలం 25 శాతం మాత్రమే పనిచేస్తోంది.

అలాగే న్యుమోనియా కూడా నిర్దారణ అయ్యింది.ఇందువల్ల ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారట.

ఇలాంటి స్దితిలో ఉన్న ఆయన పరిస్థితి విషమంగా ఉందంటున్నారట వైద్యులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube