అదానీకి మద్దతు పలికిన ఆస్ట్రేలియా మాజీ ప్రధాని.. హిండెన్‌బర్గ్ రిపోర్టుపై విమర్శలు

అదానీ సంస్థలు తమ సంపద విలువను పెంచుకునేందుకు లేని లాభాలను చూపినట్లు హిండెన్‌బర్గ్ రిపోర్టు వెల్లడించింది.చాలా స్కామ్‌లు చేసి సంపదను వందల రెట్లు పెంచుకున్నట్లు ఆరోపించింది.

 Former Australia Pm Tony Abbott Rejects Hindenburg Report Backed Gautam Adani De-TeluguStop.com

ఈ పరిస్థితుల్లో అదానీ కంపెనీల షేర్ల విలువ భారీగా పడిపోయింది.అంతేకాకుండా ప్రభుత్వ మద్దతుతోనే అదానీ సంపద లక్షల కోట్లు పెరిగిందని దేశంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఈ తరుణంలో అదానీకి ఆస్ట్రేలియా మాజీ ప్రధాన మంత్రి టోనీ అబోట్ మద్దతుగా నిలిచారు.అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదికపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రేలియాలో అదానీ గ్రూప్ చూపిన నమ్మకానికి తాను కృతజ్ఞుడను అని ఆయన అన్నారు.

ఓ టీవీ ఛానెల్‌తో సంభాషణలో, హిందన్‌బర్గ్ రీసెర్చ్‌లో అదానీ గ్రూపుపై చేసిన ఆరోపణలను అతను తోసిపుచ్చాడు.ఆరోపణలు చేయడం చాలా సులభం అని ఆయన అన్నారు.అయితే అవన్నీ నిజం కాదని వెల్లడించారు.

ఆస్ట్రేలియాలోని అదానీ గ్రూప్ బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టిందని టోనీ అబోట్ చెప్పారు.అదానీ ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు సృష్టించాడని పేర్కొన్నారు.

ఆయన దోషిగా నిరూపితమయ్యే వరకు ఆయన నిర్దోషి అని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు.

గౌతమ్ అదానీ సంస్థకు తన మనస్సులో చాలా గౌరవం ఉందని టోనీ అబోట్ వివరించాడు.తన దేశంలోని అదానీ గ్రూప్ బొగ్గు గని ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు.ఇక బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా మాజీ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి టోనీ అబోట్‌ను ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో కలిశారు.

సమావేశంలో, పార్టీ చరిత్ర, భావజాలం, అభివృద్ధి, దేశ నిర్మాణానికి దాని సహకారం గురించి నడ్డా వివరించారు.ఇటువంటి సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంచుకోవడంలో సహాయపడుతుందని బీజేపీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube