అసోం మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

 Assam, Chief Ministe, Health, Critical Condition-TeluguStop.com

మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.సామాన్య ప్రజల నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఎవరిని ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు.

నిత్యం వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.కానీ ప్రజల్లో భయం లేకుండా పోతుంది.

ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు.ఈ మహమ్మారి అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చూస్తూనే ఉన్నారు.

ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంతవరకు ప్రజలు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.తాజా మరో ప్రజాప్రతినిధి ఈ మహమ్మరి బారినపడ్డాడు.

అసోం మాజీ సీఎం త‌రుణ్ గొగోయ్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతుండగా ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు అతనికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.ఆ పరీక్షలలో అతనికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.ఇక అతను వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ఆయన తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.దీంతో ఆయనను గువాహ‌టి మెడిక‌ల్ కాలేజీ హాస్పిటలోని ఐసీయూకి తరలించారని తెలిపారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎంపీ గౌర‌వ్ గొగోయ్ తెలిపారు.అయితే అత్యుత్త‌మ చికిత్సం కోసం ఢిల్లీకి త‌ర‌లించే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

ఇక ఆయన 2001, మే 18 నుంచి 2016, మే 24 వ‌ర‌కు మూడు సార్లు అసోం ముఖ్య‌మంత్రిగా విధులు నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube