19 ఏళ్ల వయసులోనే చిరంజీవితో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్... కానీ....

Former Actress Divya Bharathi Got Chance To Act With Megastar Chiranjeevi Movie At 19 Years Old Age

ఒక్కోసారి కొంతమంది నటీనటులకు వచ్చీరావడంతోనే మంచి హిట్లు లభించడంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ.తమ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల కారణంగా చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని మరణించిన సినీ సెలబ్రిటీలు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు.

 Former Actress Divya Bharathi Got Chance To Act With Megastar Chiranjeevi Movie At 19 Years Old Age-TeluguStop.com

కాగా తెలుగులో ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన ముంబై వెటరన్ హీరోయిన్ దివ్య భారతి కూడా ఇదే కోవకి చెందుతుంది.ఈ అమ్మడు 16 సంవత్సరాల వయసులో హీరోయిన్ గా నటించి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

వచ్చీ రావడంతోనే టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కడం మరియు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడం వంటివి జరగడంతో దివ్య భారతి కి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఒక్కసారిగా బాగానే పెరిగిపోయింది.

 Former Actress Divya Bharathi Got Chance To Act With Megastar Chiranjeevi Movie At 19 Years Old Age-19 ఏళ్ల వయసులోనే చిరంజీవితో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్… కానీ….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో అప్పట్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం కూడా దివ్య భారతి కి వచ్చిందట.

దీంతో ఒక్కసారిగా సినీ విమర్శకులు ఆశ్చర్యపోయారు.అంతేకాకుండా దివ్య భారతి మెగాస్టార్ చిరంజీవి తో నటించే అవకాశం దక్కించుకున్న సమయంలో ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలని అంత చిన్న వయసులోనే మెగాస్టార్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకోవడం అంటే మాటలు కాదని విమర్శలు చేశారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి తో దివ్యభారతి నటించిన చిత్రం దాదాపుగా పదిహేను రోజుల పాటు షూటింగ్ కూడా నిర్వహించారట.కానీ దురదృష్టవశాత్తూ నటి దివ్య భారతి ముంబై నగరంలో ఉన్నటువంటి తన సొంత ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మరణించడంతో చిత్రం షూటింగ్ పనులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి.

Telugu Divya Bharathi, Actress, Actressdivya, Chiranjeevi, Tollywood-Movie

ఆ తర్వాత దివ్య భారతి స్థానంలో మరో హీరోయిన్ ని నటింపచేయాలని చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మరియు ఇతర నటీనటులు సుముఖంగా లేకపోవడంతో చిత్ర యూనిట్ సభ్యులు పూర్తిగా ఈ చిత్రాన్ని నిలిపివేశారు.కానీ నటి దివ్య భారతి మృతికి సంబంధించిన మిస్టరీ ఇప్పటికి కూడా వీడలేదు.కాగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యంగ్ హీరోయిన్ దివ్యభారతి ఉన్నట్లుండి మరణించడంతో ఒక్కసారిగా సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Telugu Divya Bharathi, Actress, Actressdivya, Chiranjeevi, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తెలుగులో ఆచార్య అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదటి నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

#Divya Bharathi #Divya Bharathi #Actress #Chiranjeevi #ActressDivya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube