లోక్ సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని హస్తం పార్టీ నియమించింది.
ఇందులో కాంగ్రెస్ నేషనల్ అలయెన్స్ కమిటీ కన్వీనర్ గా ముకుల్ వాస్నిక్ ను పార్టీ నియమించింది.అలాగే కమిటీ సభ్యులుగా గెహ్లాట్, భూపేశ్ బఘేల్, ఖుర్షీద్, మోహన్ ప్రకాశ్ లను నియమించారు.
ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.ఇండియా కూటమి సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేషనల్ అలయెన్స్ కమిటీని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.