నిన్నటి వరకు పేద రైతు..ఇప్పుడు కుబేరుడు..! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు ఎలా అయ్యాడో తెలుసా.?   Formar Motilal Prajapati Digs 44.55 Carat Diamond, In Madyapradesh     2018-10-14   05:42:23  IST  Sainath G

నిన్నటి వరకూ ‘ఈ రోజు ఎలా గడుస్తుందిరా దేవుడా..!’ అనుకున్న అతడు ఒక్క రాత్రిలోనే కుబేరుడులాగ మారిపోయాడు. అదృష్టం అంటే ఈ పేద రైతుదే. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన మోతీలాల్‌ ప్రజాపతి కుటుంబం తరతరాలుగా భూమిని లీజుకు తీసుకుని మైనింగ్‌ జరుపుతుండే వారు. మోతీలాల్‌ కూడా ఇదే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల సెప్టెంబర్‌లో క్రిష్ణ కల్యాణ్‌పూర్‌ ప్రాంతంలో 25 గజాల భూమిని లీజుకు తీసుకుని మైనింగ్‌ చేస్తున్నారు. మైనింగ్‌ చేస్తుండగా 42.59 క్యారెట్‌ బరువున్న వజ్రం దొరికింది. దీని విలువ సుమారు 1.5 కోట్లు.

Formar Motilal Prajapati Digs 44.55 Carat Diamond  In Madyapradesh-

ఈ విషయం గురించి మోతీలాల్‌ మాట్లాడుతూ.. ‘మూడు తరాల నుంచి మా కుటుంబం మైనింగ్‌లోనే ఉంది. కానీ ఎప్పుడు లాభాలు రాలేదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు అదృష్టం నా ఇంటి తలుపు తట్టింది. ఈ వజ్రాన్ని అమ్మడం వల్ల వచ్చిన సొమ్ముతో నా పిల్లలని బాగా చదివించుకుంటాను. ఇల్లు కట్టుకుంటాను.. నా సోదరుని కూతుళ్లకు వివాహం చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు.