ఇక డైరెక్ట్‌ రిలీజ్ లు ఆగినట్లేనా?  

కరోనా కారణంగా మూత బడ్డ థియేటర్లు మెల్ల మెల్లగా ఓపెన్‌ అవుతున్నాయి.థియేటర్ల అన్‌ లాక్‌కు కేంద్రం నుండి అనుమతులు వచ్చి 40 రోజులు అయినా కూడా కరోనా భయంతో ఇంకా చాలా మంది బయటకు రావడం లేదనే ఉద్దేశ్యంతో థియేటర్లను మూసే ఉంచుతున్నారు.

TeluguStop.com - Form Now There Is No Direct Ott Release In Tollywood

థియేటర్లను ఓపెన్‌ చేసేందుకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది.ఈనేపథ్యంలో అన్ని కూడా ఓపెన్‌కు రంగం సిద్దం అవుతున్నాయి.

గత కొన్నాళ్లుగా థియేటర్లు లేని కారణంగా రెడీ అయిన సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అయ్యాయి, ఇంకా కొన్ని విడుదలకు సిద్దంగా ఉన్నాయి.ఈ సమయంలో థియేటర్లు ఓపెన్‌ అంటూ ప్రకటన వచ్చిన కారణంగా ఇక డైరెక్ట్‌ రిలీజ్‌ ను క్యాన్సిల్‌ చేసుకుంటున్నాయి.

TeluguStop.com - ఇక డైరెక్ట్‌ రిలీజ్ లు ఆగినట్లేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే సోలో బ్రతుకే సోబెటర్‌ మరియు రెడ్‌ సినిమాలు ఓటీటీతో ఒప్పందం చేసుకున్నా కూడా థియేటర్ల ఓపెన్‌కు అనుమతులు వచ్చిన సమయంలో లాభమో నష్టమో థియేటర్లలోనే వెళ్దాం అన్నట్లుగా వెయిట్‌ చేస్తున్నాయి.ఆ రెండు సినిమాలతో పాటు ఇతర సినిమాలు కూడా ఓటీటీ లో విడుదల అవ్వడం తక్కువ కాబోతున్నాయి.

చిన్న బడ్జెట్‌ సినిమాలు కూడా ఎక్కువగా వెండి తెరపై విడుదలకు సిద్దం అవుతున్నాయి.ఓటీటీలో ఇకపై మళ్లీ వెబ్‌ సిరీస్‌లు మరియు పాత సినిమాలను మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది.

ఇటీవల ఓటీటీలో విడులైన సినిమాలు ముఖ్యంగా ఆకాశమే నీ హద్దురా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఇతర ఓటీటీ సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయని ఎదురు చూస్తున్న సమయంలో థియేటర్ల రిలీజ్‌కు సిద్దం అవుతున్నారు.

క్రిస్మస్‌ నుండి థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే కొన్ని సినిమాలు క్రిస్మస్‌ కానుకగా రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాయి.

#OTT Movies #Theaters Open #Direct Release #Aha OTT

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు