మనిషి గుండెను విమానంలో పెట్టి మర్చిపోయారు... ప్రపంచంలోనే ఇలాంటి మతిమరుపు సంఘటన జరగలేదేమో!

టెక్నాలజీ బాగా మారిపోయింది.ఒకప్పుడు చిన్న జబ్బు వచ్చినా కూడా మృత్యువుతో పోరాడాల్సి వచ్చేది.

 Forgotten Man Real Heart In Flight1-TeluguStop.com

కాని ప్రస్తుతం గుండెను సైతం మార్చే పద్దతులు వచ్చాయి.ఒకరి గుండెను మరొకరికి పెట్టేంతగా టెక్నాలజీ మారింది.

తాజాగా అమెరికాలో ఒక గుండె మార్పిడికి సిద్దం అయ్యారు.ఒక వ్యక్తి యాక్సిడెంట్‌ లో మృతి చెందడంతో ఆయన గుండెను మరో వ్యక్తికి అమర్చేందుకు వైధ్యులు సిద్దం అయ్యారు.

గుండెను విమానంలో పేషెంట్‌ వద్దకు తీసుకు వెళ్లాల్సి ఉంది.అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు.

కొన్ని గంటల పాటు గుండె సజీవంగా ఉండేలా విమానంలో ఏర్పాట్లు చేసి ఆ గుండెను విమానం ఎక్కించారు.కాని ఆ గుండెను మర్చి పోయి అత్యంత పెద్ద పొరపాటు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కాలిఫోర్నియా నుండి గుండెను సియాటిల్‌కు గుండెను తరలించేందుకు వైధ్యులు సిద్దం అయ్యారు.ఎయిర్‌ బస్‌ సియాటిల్‌కు చేరుకుంది.అక్కడ ప్యాసింజర్స్‌ అంతా కూడా దిగిపోయారు.మళ్లీ ఆ విమానం తిరిగి కాలిఫోర్నియాకు బయుజేరింది.విమానంలో గుండె ఉన్న విషయాన్ని సిబ్దంది కాని, ఏ ఒక్కరు కూగా గుర్తించలేక పోయారు.కొద్ది సమయం తర్వాత పైలెట్‌ విమానంను తిరిగి సియాటిల్‌కు మరలిస్తున్నట్లుగా పేర్కొనడంతో విమానంలో ఉన్న వారు అంతా కూడా షాక్‌ అయ్యారు.

విమానంలో గుండె ఉంది, దాన్ని సియాటిల్‌లో దించడం మర్చి పోయాం, అందుకే విమానం తిప్పుతున్నట్లుగా అనౌన్స్‌ చేయగానే అంతా కూడా నోరెళ్ల బెట్టారట.మరీ ఇంత అలసత్వం ఏంటీ అంటూ ఆగ్రమం వ్యక్తం చేశారు.ఇక గుండెను మనిషి శరీరం నుండి తొలగించిన తర్వాత ఎంత సమయం సజీవంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకునేందుకు చాలా మంది మొబైల్స్‌ సెర్స్‌ చేశారు.దాదాపుగా ఆరు గంటల పాటు గుండె ఉంటుందట.

గుండె మర్చి పోవడంపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో సదరు విమాన సంస్థ నుండి ప్రకటన వచ్చింది.తాము అనుకున్న సమయానికి గుండెను చేర్చగలిగాం అని, ఎలాంటి ఇబ్బంది లేకుండా పని జరిగి పోయిందని చెప్పుకొచ్చారు.

ఒక వేళ ఇంకాస్త ఆలస్యం అయ్యి ఉంటే పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మరీ దారుణంగా ఇలా మర్చిపోవడం ఏంటీ అంటూ ప్రపంచ వ్యాప్తంగా జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube