మ‌తిమ‌రుపు మంచిదే... కానీ...  

Forgetting Better To Good Life-

English Summary:Santosalanistundannadi natural sparkle in our purtikula says the man ..It is true that many of the events that happen in our life gurtupettukuntam choose. Boledanni which badincevi us.It is good to remember the spot ..But in the good, the people to cooperate, gurtuncukovalasinde friends ..

Indeed many varieties forgetful. Remember to put in the house where the absence of an object, a task for anyone to ignore cesipedatanani saying, rou'tine us.However, evidence exists that many of the good managranthalalo how dangerous to ignore.

Tired of searching we found a vastuvukosam seek, kanapincagane happy.Tittukuntam our matimarupuki ourselves. Ayarojulalo kondamandi regular fasting, being a morning practice, whether it be the day, but sometimes unintentionally engilipaddaka gurtukuradu about fasting.Some would have thought that they remember him poyamendukani the other. This kind of ideas are bad for health.That is why some mahanubhavulu mancidenantaru forgetful.

One man forgetful habits.

మ‌రుపు మ‌నిషికి సుఖ సంతోషాల‌నిస్తుంద‌న్న‌ది మ‌న పూర్తీకుల ఉవాచ‌. నిజ‌మే మ‌న నిత్య‌జీవితంలో జ‌రిగే అనేక ఘ‌ట‌న‌లు ఎన్న‌ని గుర్తుపెట్టుకుంటాం..

మ‌తిమ‌రుపు మంచిదే... కానీ...-

వీటిలో మ‌న‌ల్ని బాదించేవీ బోలెడు. వాటిని అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌చిపోతే మంచిదే. అలాగ‌ని జ‌రుగుతున్న మంచిని, అందుకు స‌హ‌క‌రించిన వారిని, స్నేహితుల్ని గుర్తుంచుకోవ‌ల‌సిందే.ఇంత‌కీ మతిమరుపులో చాలా రకాలుంటాయి.

ఇంట్లో ఒక వస్తువు ఎక్క‌డ పెట్టామో గుర్తుకు రాక‌పోవ‌టం, ఎవరికైనా ఒక పని చేసిపెడతానని చెప్పి మర్చిపోవడం,మ‌నకి నిత్య‌కృత్యం. అయితే చేసిన మేలును మర్చిపోవడం ఎంత ప్రమాదకరమైనదో మ‌న‌గ్రంథాలలో అనేక సాక్ష్యాలున్నాయి. ఓ వస్తువుకోసం వెతికి వెతికి దొరకలేదని విసుగు చెందే మ‌న‌మే, క‌న‌పించ‌గ‌నే సంతోషిస్తాం.

మ‌న మ‌తిమ‌రుపుకి మ‌న‌ల్నే మ‌నం తిట్టుకుంటాం. కొంద‌మంది నిత్యం ఆయారోజుల‌లో ఉప‌వాసం, ఒక పొద్దు ఉండటం అల‌వాటే అయినా, ఒక్కోసారి అనాలోచితంగా ఎంగిలిప‌డ్డాక గాని ఆరోజు ఉండాల్సిన ఉప‌వాసం గురించి గుర్తుకురాదు. ఇక ఎదుటి వాడికి తాము గుర్తులేకుండా పోయామెందుక‌ని ఆలోచించేవారు మ‌రి కొంద‌రు.

ఈ త‌ర‌హా ఆలోచ‌న‌లు ఆరోగ్యానికి కీడు చేస్తాయి. అందుకే మ‌తిమ‌రుపు మంచిదేనంటారు కొంద‌రు మహానుభావులు. మనిషికున్న అలవాట్లలో మతిమరుపు ఒకటి.

‘మతిమరుపు లేనిదే జీవితం కొనసాగదు’ అని బాల్జాక్‌ మహాశయుడన్నాడు. జ్ఞాపకాలతో బాధపడటం కంటె మరచిపోవడమే మేలు అన్నాడు ల్వాండన్‌ మహాశయుడు. ‘నీకు తెలిసిన వాటిని మర్చిపోవడమే కొన్నిసార్లు మేలు’ సైరస్‌ అన్నాడు.

ఇలా మతిమరుపును గురించి ప్రముఖులు రకరకాలుగా వారి ఉద్దేశ్యాలను తెలిపారు.అయితే మనిషి ఉద్దేశ‌పూర్వ‌కంగానే అవివేకిగా మారిపోతున్నాడు. ఒక్కోసారి తనను తానే మరచిపోతూ, తనని సృష్టి ంచి, స‌మాజంలో నిల‌దొక‌కుకునేలా చేసిన అమ్మ‌, నాన్న‌, గురువు, దైవం, ఈ స‌మాజం ప‌ట్ల త‌న బాధ్య‌త‌లు మరచిపోతూ, అదీ మ‌తిమ‌రుపే అని పేరు పెట్టేయ‌డ‌మే హీనాతి హినం.