ఆ ఏనుగును కాపాడేందుకు అటవీ అధికారులు ఏం చేశారంటే ?

ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం అంతకంతకూ పెరుగుతోంది.మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోలిస్తే సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెరుగుతోంది.

 Forest Officials Rescued Elephant Which Falls In Trench Viral Video, Elephant, V-TeluguStop.com

ఎక్కడ ఏ ఘటన జరిగినా నిమిషాల్లో సోషల్ మీడియా ఆ విషయాలను ప్రజలకు చేరవేస్తోంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో లోయలో పడిన ఒక ఏనుగును బయటకు తీసుకువచ్చేందుకు అటవీ శాఖ అధికారులు చేసిన కృషికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

భారీ క్రేన్ల సహాయంతో అధికారులు ఎంతో కష్టపడి లోయలో పడిన ఏనుగును రక్షించారు.కర్ణాటక రాష్ట్రంలోని వన్యప్రాణుల అభయారణ్యంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో మూగజీవాన్ని రక్షించడం అధికారులు చేసిన కృషిని నెటిజన్లు అభినందిస్తున్నారు.

ఆ ప్రాంతంలో అటవీశాఖ అధికారిగా పని చేస్తున్న ఏడుకొండలు అనే వ్యక్తి ట్విట్టర్ లో వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

ఒక ఏనుగు అరణ్యంలోని అర్కానహల్లా లోయ దగ్గర పడిపోగా స్థానికులు దాని గుర్తించి సమాచారం ఇచ్చారు.

విషయం తెలిసిన వెంటనే అటవీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.అధికారులు క్రేన్ సహాయంతో దారిని తయారు చేయగా ఏనుగు సులభంగా పైకి రాగలిగింది.

అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవడంపై జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, వందల్లో కామెంట్లు వస్తుండటం గమనార్హం.