బాబు 'గొంతు' పట్టుకుంటారా?

గొంతు పట్టుకోవడమంటే పీక పిసకడమనే అర్థం కూడా ఉంది.గొంతు పట్టుకోవడమంటే నిలదీయడం, బెదిరించడం అనే అర్థంలో కూడా చెప్పుకోవచ్చు.

 Forensic Lab Confirms Tapes Not Doctored-TeluguStop.com

అయితే ఇక్కడ ఈ అర్థాలు వర్తించవు.గొంతు పట్టుకోవడమంటే ఓటుకు నోటు కేసులో ఒక పాత్రధారిగా భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి, ఇతర నాయకులకు స్వర పరీక్ష చేయడం.

అంటే ‘వాయిస్‌ టెస్టు’ అన్నమాట.నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడిన సంభాషణను టీ న్యూస్‌ సహా కొన్ని టీవీ ఛానెళ్లు ప్రసారం చేయడం, దానిపై వెంటనే దుమారం రేగడం, ఫోన్‌లు ట్యాప్‌ చేస్తున్నారని బాబు, ఏపీ మంత్రులు కేసీఆర్‌పై, తెలంగాణ సర్కారుపై మండిపడటం, దీనిపై దర్యాప్తు ప్రారంభించడం….

ఈ కథంతా తెలుసు.తాజాగా బయటపడిన విషయమేమిటంటే….

ఫోరెన్సిక్‌ అధికారులు ఆడియో టేపుల్లో ఉన్నది బాబు గొంతేనని, ఇది అసలు సిసలు వాయిసేనని, ఎలాంటి వక్రీకరణ జరగలేదని తేల్చి చెప్పారు.దీంతో తెలంగాణ ఏసీబీ అధికారులు బాబుకు, ఈ కేసుతో సంబంధం ఉన్నవారికి స్వర పరీక్షలు చేస్తామని, అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌ వేశారు.

గొంతు నమూనాలను ఒరిజినల్‌ టేపులతో పోల్చి చూస్తారు.అవి ఒకటేనని భావిస్తే నేరం చేసినట్లుగా నిర్ధారిస్తారు.

స్వర పరీక్షలకు హాజరు కావాలని కోర్టు చంద్రబాబును, సంబంధిత నాకులను ఆదేశించవచ్చని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube