కరోనా కొత్త వేరియంట్ ఆందోళనలో భారత ఎన్నారైలు..!!

Foreigners Tension Over Covid New Variant

ప్రపంచ వ్యాప్తంగా కరోన మహమ్మారి సృష్టించిన అలజడి నుంచీ ఇంకా ప్రజలు తేరుకోలేదు, ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గి ప్రపంచ దేశాలన్నీ వలస వాసులను తమ దేశాలలోకి ఆహ్వానిస్తున్నాయి.కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, ఉపాది లేక సొంత దేశాలకు వెనుదిరిగి వచ్చేసిన ఎంతో మంది ఎన్నారైలు మళ్ళీ ఇప్పుడు ఎన్నో ఆశలతో ఆయా దేశాలకు వలసలు వెళ్తున్నారు.

 Foreigners Tension Over Covid New Variant-TeluguStop.com

ఈ తరుణంలో కరోనా మహమ్మారి నుంచీ మరో కొత్త వేరియంట్ వచ్చిందని ఈ మహమ్మారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేయడంతో మళ్ళీ భారత ఎన్నారైలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ధికంగా చితికిపోయి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ఎన్నారైలు కొత్త వేరియంట్ రాకతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

 Foreigners Tension Over Covid New Variant-కరోనా కొత్త వేరియంట్ ఆందోళనలో భారత ఎన్నారైలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటి వేవ్ సమయంలో ఎదుర్కున్న గడ్డు కాలం కొత్త వేరియంట్ తో మళ్ళీ రిపీట్ అవుతుందా అనే భయం అందరిని వెంటాడుతోంది.ఇప్పుడిప్పుడే విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న ఎన్నారైలకు కొత్త వేరియంట్ రాక ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆవేదన చెందుతున్నారు.

ఇదిలాఉంటే

భారత ప్రభుత్వం విదేశీయుల రాకపై కీలక నిర్ణయం తీసుకుంది.పలు దేశాలలో ఇప్పటికే కొత్త వేరియంట్ ప్రభావం చూపుతున్న తరుణంలో అంతర్జాతీయ ప్రయాణీకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.

ముఖ్యంగా దక్షిణాఫ్రికా నుంచీ వచ్చే ప్రయాణీకులకు అన్ని పరీక్షలు చేసిన తరువాత దేశంలోకి అనుమతులు ఇవ్వాలని సూచించింది.అలాగే హాంకాంగ్ నుంచీ వచ్చే వారిపై కూడా అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమాన పరిస్థితులు ఉన్నా వెంటనే చర్యలు చేపట్టాలని, ముందస్తుగ ప్రణాలికాలు సిద్దం చేసుకోవాలని హెచ్చరించింది.

అయితే ప్రస్తుతం రెండు దేశాల నుంచీ వచ్చే వారిపై నిభందనలు పెట్టినా భవిష్యత్తులో విదేశాల నుంచీ వచ్చే మన స్వదేసీయులపై కూడా ఈ నిభందనలు విధించే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు.

#Covid #Hang Kong #Indian #Corona #Africa

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube